మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దనరెడ్డి
మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దనరెడ్డి
బనగానపల్లె, జనవరి 27: బనగానపల్లెను రెవెన్యూ డివిజనగా ఏర్పాటు చేయాలని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దనరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జిల్లాలను 26కు పెంచుతూ ప్రభుత్వం ప్రకటించిందని, ఇందులో భాగంగా ఏర్పడే నంద్యాల జిల్లాకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జిల్లాగా నామకరణం చేయాలని బీసీ డిమాండ్ చేశారు. నరసింహారెడ్డి పేరును పెడితే ఈ ప్రాంత ప్రజలు సంతోషిస్తారని అన్నారు. అలాగే నంద్యాల జిల్లాలో డోనను కొత్త రెవెన్యూ డివిజన చేయడం అన్యాయమన్నారు. డోన డివిజన చేయడం వల్ల బనగానపల్లె నియోజకవర్గంలోని కొలిమిగుండ్ల, సంజామల, అవుకు, కోవెలకుంట్ల మండలాల ప్రజలకు ఇబ్బందిగా ఉంటుందన్నారు. కొలిమిగుండ్ల మండలానికి డోన 114 కిలోమీటర్లు, కోవెలకుంట్లకు 95 కిలోమీటర్లు, సంజామలకు 100 కిలోమీటర్ల దూరంలో ఉందని అన్నారు. డోనకు వెళ్లడానికి కనీసం బస్ సౌకర్యం కూడా లేదన్నారు. మూడు బస్సులు మారి ఈ ప్రాంత ప్రజలు డోన వెళ్లాల్సి వస్తుందని అన్నారు. బనగానపల్లె ప్రాంతంలో యాగంటిక్షేత్రం, నందవరం చౌడేశ్వరీమాత ఆలయం, బెలుంగుహలు వంటి చారిత్రాత్మక ప్రాంతాలు ఉన్నాయన్నారు. ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు ప్రజల అభిప్రాయాలను సీఎం దృష్టికి తీసుకుపోయి బనగానపల్లెను రెవెన్యూ డివిజన చేసే విధంగా కృషి చేయాలని అన్నారు. బనగానపల్లెను డివిజనగా చేస్తే బేతంచెర్లకు 16 కిలోమీటర్లు, డోన 55 కిలోమీటర్లు, ప్యాపిలికి కేవలం 54 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుందన్నారు. డోన ప్రాంతాలకు కూడా అనుకూలంగా ఉంటుందని అన్నారు. ఈ అన్ని ప్రాంతాలకు బనగానపల్లె సెంటర్‌గా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ అంబాల రామకృష్ణారెడ్డి, జిల్లా మైనార్టీ టీడీపీ అధ్యక్షుడు జాహిద్‌హుస్సేన, సీనియర్ టీడీపీ నాయకుడు కప్పెట నాగేశ్వరరెడ్డి, మండల టీడీపీ అధ్యక్షుడు పీవీ కుమార్‌రెడ్డి, సర్పంచ తులసిరెడ్డి, ఉప సర్పంచ బురానుద్దీన, మండల టీడీపీ వైస్ ప్రెసిడెంట్ జహంగీర్, గడ్డం చెన్నారెడ్డి, మంచాలమద్దిలేటిరెడ్డి, రాయలసీమ సలాం, పూలకలాం పాల్గొన్నారు.
‘నంద్యాలను జిల్లాగా ప్రకటించడం హర్షణీయం’
బనగానపల్లె, జనవరి 27: నంద్యాలను జిల్లాగా ప్రకటించడం పట్ల ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, ఎమ్మెల్సీ చల్లా భగీరఽథరెడ్డి ఆధ్వర్యంలో థ్యాంక్యు సీఎం కార్యక్రమాన్ని బనగానపల్లెలో గురువారం నిర్వహించారు. బనగానపల్లె పట్టణంలోని పొట్టి శ్రీరాముల విగ్రహం కూడలి నుంచి పాతబస్టాండ్, ఆస్థానం రోడ్డు మీదుగా పెట్రోల్ బంకు కూడలి వరకు వైసీపీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. పెట్రోల్ బంకు కూడలిలో ఎమ్మెల్యే కాటసాని, ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి మాట్లాడుతూ నంద్యాలను జిల్లాగా ప్రకటించడం పట్ల ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. సీఎంను కలసి బనగానపల్లెను రెవిన్యూ డివిజన చేసేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో కర్రా హర్షవర్దనరెడ్డి, డాక్టర్ మహహ్మద్‌హుస్సేన, సిద్దంరెడ్డి రామ్మోహనరెడ్డి, యాగంటి ఆలయ చైర్మన బుచ్చిరెడ్డి, నందవరం చౌడేశ్వరీమాత ఆలయ చైర్మన పీఆర్‌వెంకటేశ్వరరెడ్డి, అబ్దుల్‌ఫైజ్, జిల్లెళ్ల శివరామిరెడ్డి, మార్కెట్‌యార్డు చైర్మన దీవెనమ్మ, జడ్పీటీసీ లక్ష్మిసుబ్బమ్మ, సర్పంచ ఎల్లమ్మ, మనోహర్‌రెడ్డి, బండి బ్రహ్మానందరెడ్డి, సురేవ్‌రెడ్డి, డీలర్ నారాయణ, వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.