Abn logo
Aug 9 2021 @ 08:38AM

National Bamboo Mission: హిమాచల్‌లో వెదురు టూత్‌బ్రెష్‌ల పరిశ్రమ ఏర్పాటు!

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లోని బంగాణా పరిధిలోని బైల్‌లో వెదురుతో తయారుచేసే టూత్ బ్రెష్‌ల పరిశ్రమను ఏర్పాటు చేయనున్నారు. నేషనల్ బేంబూ మిషన్ కింద ఈ ప్రాజెక్టు చేపట్టనున్నారు. ఈ పరిశ్రమ ఏర్పాటుతో 500 మంది నిరుద్యోగులకు ఉపాధి లభ్యంకానుంది. ఈ పరిశ్రమ ఏర్పాటుకు మహారాష్ట్రకు చెందిన ఒక ప్రైవేటు కంపెనీ సాయం తీసుకోనున్నారు. 

ఈ కంపెనీ ఇప్పటికే పూణెలో వెదురు టూత్ బ్రెష్‌లను తయారు చేస్తోంది. ప్రస్తుతం ఈ కంపెనీ బైల్‌లో ఏర్పాటయ్యే టూత్ బ్రెష్‌ల పరిశ్రమకు సంబంధించిన ప్రణాళికను సిద్ధం చేస్తోంది. త్వరలోనే ఇక్కడి యువతకు వెదురు టూత్‌బ్రెష్ ల తయారీలో శిక్షణ ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా డీఆర్డీఏ సంజీవ్ ఠాకుర్ మాట్లాడుతూ ఈ పరిశ్రమకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభదశలో ఉన్నదని తెలిపారు. ఈ ప్రాంతంలో అనేక వెదురు రకాలు లభ్యం అవుతున్న నేపధ్యంలో ప్రభుత్వం ఈ పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు వచ్చింది.