Ballari జిల్లాధికారి కార్యాలయం వద్ద బారికేడ్లు

ABN , First Publish Date - 2022-01-15T14:12:06+05:30 IST

నిత్యం జనసందోహం నడుమ కిటకిటలాడుతున్న జిల్లాధికారి కార్యాలయం, జిల్లాపంచాయతీ, తాలూకా కార్యాలయంలో సిబ్బందికి కరోనా పాజిటివ్‌ రావడంతో మూడు కార్యాలయాల్లో సార్వజనికుల సందర్శనాన్ని నిషేదించారు. ప్రధానంగా

Ballari జిల్లాధికారి కార్యాలయం వద్ద బారికేడ్లు

బళ్లారి(కర్ణాటక): నిత్యం జనసందోహం నడుమ కిటకిటలాడుతున్న జిల్లాధికారి కార్యాలయం, జిల్లాపంచాయతీ, తాలూకా కార్యాలయంలో సిబ్బందికి కరోనా పాజిటివ్‌ రావడంతో మూడు కార్యాలయాల్లో సార్వజనికుల సందర్శనాన్ని నిషేదించారు. ప్రధానంగా జిల్లాధికారి కార్యాలయం వివిధ విభాగాల్లో పనిచేస్తే 13 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు తేలడంతో శుక్రవారం మధ్యాహ్నం నుంచి అన్ని విభాగాలు బంద్‌ చేసి కార్యాలయంలోనికి ఎవరూ వెళ్ళకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా తాలూకా కార్యాలయంలో ముగ్గురు సిబ్బందికి కరోనా సోకడంతో దానిలోకి కూడా శుక్రవారం మధ్యాహ్నం నుంచి సార్వజనికుల ప్రవేశాన్ని నిషేదించారు. 

Updated Date - 2022-01-15T14:12:06+05:30 IST