బాల్‌ బ్యాడ్మింటన్‌ విజేత ఆంధ్రా

ABN , First Publish Date - 2022-01-13T05:35:34+05:30 IST

జాతీయ స్థాయి బాల్‌బ్యాడ్మింటన్‌ పోటీల్లో బాలుర విభాగంలో ఆంధ్రప్రదేశ్‌ జట్టు, బాలికల విభాగంలో తమిళనాడు జట్టు విజేతలుగా నిలిచాయి. రాజాంలోని తృప్తి రిసార్ట్స్‌లో ఐదు రోజులుగా నిర్వహిస్తున్న 40వ జాతీయ స్థాయి బాల్‌బ్యాడ్మింటన్‌ (సబ్‌ జూనియర్స్‌) పోటీలు బుధవారంతో ముగిశాయి. ఫైనల్స్‌లో బాలురు, బాలికల విభాగాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు జట్లు హోరాహోరీగా పోరాడాయి. ఇరు రాష్ట్రాల జట్లు ఒక్కో విభాగంలో విజేతలుగా నిలిచాయి.

బాల్‌ బ్యాడ్మింటన్‌ విజేత ఆంధ్రా
బాలుర విభాగంలో విజేతగా నిలిచిన ఆంధ్రప్రదేశ్‌ జట్టుకు షీల్డ్‌ అందిస్తున్న దృశ్యం

- బాలికల విభాగంలో తమిళనాడు సత్తా

- ముగిసిన జాతీయ స్థాయి క్రీడలు

రాజాం రూరల్‌,  జనవరి 12: జాతీయ స్థాయి బాల్‌బ్యాడ్మింటన్‌ పోటీల్లో బాలుర విభాగంలో ఆంధ్రప్రదేశ్‌ జట్టు, బాలికల విభాగంలో తమిళనాడు జట్టు విజేతలుగా నిలిచాయి. రాజాంలోని తృప్తి రిసార్ట్స్‌లో ఐదు రోజులుగా నిర్వహిస్తున్న 40వ జాతీయ స్థాయి బాల్‌బ్యాడ్మింటన్‌ (సబ్‌ జూనియర్స్‌) పోటీలు బుధవారంతో ముగిశాయి. ఫైనల్స్‌లో బాలురు, బాలికల విభాగాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు జట్లు హోరాహోరీగా పోరాడాయి. ఇరు రాష్ట్రాల జట్లు ఒక్కో విభాగంలో విజేతలుగా నిలిచాయి. బాలుర విభాగంలో ఆంధ్రా జట్టు విజేతగా నిలవగా.. తమిళనాడు జట్టు రన్నరప్‌ సాధించింది. కర్ణాటక, మహారాష్ట్ర జట్లు మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. బాలికల విభాగానికి సంబంధించి తమిళనాడు జట్టు విజేత కాగా, ఆంధ్రప్రదేశ్‌ జట్టు రన్నరప్‌గా నిలిచింది. కేరళ, కర్ణాటక జట్లు మూడు, నాలుగు స్థానాలు సాధించాయి.  


- డబుల్స్‌ విభాగంలో

డబుల్స్‌లో... బాలికల విభాగానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ విన్నర్‌ కాగా, తమిళనాడు జట్టు రన్నరప్‌గా నిలిచింది. కేరళ జట్టు మూడో స్థానం, ముంబై జట్టు నాలుగో స్థానాన్ని కైవశం చేసుకున్నాయి. బాలుర విభాగానికి సంబంధించి తమిళనాడు జట్టు విన్నర్‌ కాగా, ఆంధ్రప్రదేశ్‌ జట్టు రన్నరప్‌తో  నిలిచింది. కేరళ జట్టు మూడోస్థానం, తెలంగాణ జట్టు నాలుగో స్థానంలో నిలిచాయి


- మిక్సిడ్‌ డబుల్స్‌ విభాగంలో... 

.మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగానికి సంబంధించి తమిళనాడు జట్టు విన్నర్‌ కాగా, ఆంధ్రప్రదేశ్‌ జట్టు రన్నరప్‌గా నిలిచింది. కర్ణాటక, తెలంగాణ జట్లు మూడు, నాలుగు స్థానాలలో నిలిచాయి. విజేతలకు బాల్‌బ్యాడ్మింటన్‌ ఫెడరేషన్‌ ఏసియన్‌ సి.ఇ.ఒ. రాజారావు ఆధ్వర్యంలో షీల్డ్‌లు అందజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న బీబీఎఫ్‌ ఇండియా చీఫ్‌ రిఫరీ జ్యోతిష్‌.. అన్ని రాష్ట్రాల్ర క్రీడాకారులతో పాటు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలను అభినందించారు. ప్రధానంగా మణిపూర్‌ సీఎం.. క్రీడాకారులను ప్రత్యేక విమానంలో పంపించడం ఆయనకు క్రీడలపై ఉన్న శ్రద్ధను తెలియజేస్తోందని అభినందించారు. కార్యక్రమంలో తృప్తి రిసార్ట్స్‌ అధినేత, ఆంధ్రా టీమ్‌ మేనేజర్‌ మురళి కృష్ణంరాజు, బీహెచ్‌ అరుణ్‌కుమార్‌, కోడి మోహన్‌, అరుణకుమారితో పీడీలు, పీఈటీలు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-13T05:35:34+05:30 IST