భక్తిశ్రద్ధలతో బాలకాండ పారాయణం

ABN , First Publish Date - 2021-09-29T06:22:19+05:30 IST

తిరుమల నాదనీరాజనం వేదికపై మంగళవారం బాలకాండలోని 3 నుంచి 7వ సర్గ వరకు ఉన్న 142 శ్లోకాలను వేదపండితులు పారాయణం చేశారు.

భక్తిశ్రద్ధలతో బాలకాండ పారాయణం

తిరుమల, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): తిరుమల నాదనీరాజనం వేదికపై మంగళవారం బాలకాండలోని 3 నుంచి 7వ సర్గ వరకు ఉన్న 142 శ్లోకాలను వేదపండితులు పారాయణం చేశారు.ఎస్వీ వేద విశ్వవిద్యాలయం అధ్యాపకుడు రామకృష్ణ సోమయాజులు ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా మూడో వేవ్‌ బారిన పడకుండా అందరూ సుఖశాంతులతో ఉండాలని ఈ కార్యక్రమం నిర్వహించినట్టు చెప్పారు.ధర్మగిరి వేదపాఠశాల, ఎస్వీ వేద విశ్వవిద్యాలయం అధ్యాపకులు, ఎస్వీ ఉన్నత వేదాఽధ్యాయన సంస్థకు చెందిన వేద పారాయణదారులు, సంస్కృత విశ్వవిద్యాలయానికి చెందిన శాస్ర్తీయ పండితులు పాల్గొన్నారు.ఎస్వీ సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు వందన బృందం ఆలపించిన జగదానందకారక.. కీర్తనతో శ్లోకపారాయణం ప్రారంభం కాగా రామ రామ రామ భజే విశేష సుందరం.., అనే కీర్తనతో ముగిసింది. టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఉపకులపతి మురళీధర శర్మ, టీటీడీ వైఖానస ఆగమ సలహాదారు మోహనరంగాచార్యులు తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2021-09-29T06:22:19+05:30 IST