అధ్వాన రోడ్లకు మరమ్మతులు చేయాలి

ABN , First Publish Date - 2021-07-25T05:44:49+05:30 IST

ఏజెన్సీలో అధ్వానంగా తయారైన రహదారులను నెలాపదిహేను రోజుల్లో మరమ్మతులు చేపట్టాలని, లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

అధ్వాన రోడ్లకు మరమ్మతులు చేయాలి
ఎ.శనివారం రహదారిపై వరి నాట్లు వేస్తున్న మాజీ ఎమ్మెల్యే ఈశ్వరి, టీడీపీ నాయకురాలు జ్ఞానేశ్వరి




ఎ.శనివారం రహదారిపై వరి నాట్లు వేసి నిరసన

టీడీపీ హయాంలో తారురోడ్లకు నిధులు 

విడుదల చేస్తే వైసీపీ ప్రభుత్వం రద్దు 

ఆదివాసీల అభివృద్ధిని గాలికొదిలేశారా..?

పాడేరు మాజీ ఎమ్మెల్యే ఈశ్వరి


చింతపల్లి, జూలై 24:ఏజెన్సీలో అధ్వానంగా తయారైన రహదారులను నెలాపదిహేను రోజుల్లో మరమ్మతులు చేపట్టాలని, లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శనివారం టీడీపీ నేదలతో కలిసి కాలినడకన అంజలి శనివారం రహదారిని పరిశీలించారు. బురద పొలాన్ని తలపించిన ఎ.శనివారం రహదారిపై టీడీపీ నాయకులు వరి నాట్లు వేసి నిరసన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ, ఏజెన్సీ వ్యాప్తంగా రహదారులు అధ్వానంగా తయారయ్యాయన్నారు. ప్రధానంగా చింతపల్లి-లంబసింగి, కొమ్మంగి, యర్రబొమ్మలు-కొండవంచుల, ఎ.శనివారం రహదారులు అత్యంత దారుణంగా తయారయ్యాయన్నారు.  రోగులు, బాలింతలు, గర్భిణులను డోలిపై ఆస్పత్రులకు మోసుకొని వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. ఎ.శనివారం రహదారి నిర్మాణానికి టీడీపీ ప్రభుత్వం రూ.2.75 లక్షల సీఆర్‌ఆర్‌-టీఎస్పీ నిధులు మంజూరు చేసిందన్నారు. నిర్మాణ పనులు కూడా ప్రారంభమయ్యాయని, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేసిందన్నారు. ముఖ్యమంత్రి జగన్‌కి ఆదివాసీల అవస్థలు కనిపించడం లేదా.. వినిపించడం లేదా అని ఆమె ప్రశ్నించారు. గిరిజనుల అభివృద్ధిని పట్టించుకోకపోతే రానున్న కాలంలో వైసీపీ ప్రభుత్వాన్ని కూలగొడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అరకు పార్లమెంట్‌ కార్యనిర్వాహక కార్యదర్శి చల్లంగి జ్ఞానేశ్వరి, పార్టీ మండల అధ్యక్షుడు కిల్లో పూర్ణచందరరావు, ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు, పార్టీ నాయకులు చల్లంగి లక్ష్మణరావు, కిముడు లక్ష్మయ్య, శ్రీధర్‌, పోతురాజుపడాల్‌, రామ్మూర్తి, కిముడు నారాయణరావు, ఉత్తర కుమారి, లకే రామస్వామి, కిముడు సింహాచలం పాల్గొన్నారు.  

Updated Date - 2021-07-25T05:44:49+05:30 IST