హుజూరాబాద్‌ ఏరియా ఆస్పత్రిలో పసికందు మృతి

ABN , First Publish Date - 2022-08-14T06:00:37+05:30 IST

హుజూరాబాద్‌ ఏరియా ఆస్పత్రిలో ఓ మహిళకు నార్మల్‌ డెలివ రీలో పుట్టిన పసికందు మృతి చెందింది.

హుజూరాబాద్‌ ఏరియా ఆస్పత్రిలో పసికందు మృతి

- సిబ్బంది నిర్లక్ష్యం వల్లేనని బంధువుల ఆందోళన

హుజూరాబాద్‌, ఆగస్టు 13: హుజూరాబాద్‌ ఏరియా ఆస్పత్రిలో ఓ మహిళకు నార్మల్‌ డెలివ రీలో పుట్టిన పసికందు మృతి చెందింది. దీంతో ఆస్పత్రి ఎదుట బంధువులు సిబ్బంది నిర్లక్ష్యం వల్లే మృతి చెందిందని శనివారం ఆందోళన చేశారు. బాధిత కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. శంకరపట్నం మండలం మొలంగూర్‌ గ్రామానికి చెందిన పూదరి శ్రావణికి పురిటినొ ప్పులు రావడంతో శుక్రవారం హుజూరాబాద్‌ ఏరియా ఆస్పత్రికి తీసుకువ చ్చారు. విధుల్లో ఉన్న డాక్టర్‌ అడ్మిట్‌ చేసుకొని నార్మల్‌ డెలివరీ అవుతుందని తెలిపారు. రాత్రి 8గంటలకు పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో సిబ్బంది ఆపరేషన్‌ నిర్వహించగా పా ప పుట్టింది. పాపకు కదలిక లేకపోవడంతో ఎంజీఎంకు తీసుకెళ్లాలని శ్రావణి భర్త పవన్‌కు సూచించారు. 108లో వరంగల్‌ ఎంజీఎంకు తీసుకెళ్లగా అక్కడి వైద్యులు పాప మృతి చెందినట్లు  నిర్ధారించారు. దీంతో హుజూరాబాద్‌ ఏరియా ఆస్పత్రి ఎదు ట వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వలనే పాప మృతి చెందిందని బంధువులు, ఏఐఎస్‌ఎఫ్‌, పీడీఎస్‌యూ నాయకులు ఆందోళన చేశారు.  విషయం తెలు సుకున్న హుజూరాబాద్‌ రూరల్‌ సీఐ జనార్దన్‌, ఎస్సై ఆసిఫ్‌ అక్కడికి స్థలానికి చేరుకొని బాధితులకు నచ్చజె ప్పేందుకు యత్నించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రాజేందర్‌రెడ్డి, ఆర్‌ఎంవో సుధాకర్‌రావు పసికందు మృతిపై విచారణ కమిటీ వేసి నిర్లక్ష్యం వహించిన వారిపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో బాధితులు వెళ్లిపోయారు.

Updated Date - 2022-08-14T06:00:37+05:30 IST