Advertisement
Advertisement
Abn logo
Advertisement

‘పొత్తు’ ఎప్పుడూ మంచిదే..

ఆంధ్రజ్యోతి(29-07-2020)

ప్రశ్న: మొక్కజొన్నలోని పోషక విలువలు తెలుపండి. బేబీ కార్న్‌ మంచిదేనా?


- కోటేశ్వరరావు, రాజమండ్రి 


డాక్టర్ సమాధానం: వందగ్రాముల ఉడికించిన మొక్కజొన్న గింజల్లో దాదాపు వంద కేలొరీలు ఉంటాయి. అన్ని రకాల ముడి ధాన్యాల్లానే మొక్కజొన్నలో కూడా పిండి పదార్ధాలు అధికం. ఈ పిండిపదార్ధాల్లో భాగంగానే కొంత చక్కెర, కొంత పీచుపదార్థం ఉంటాయి. మొక్క జొన్న పేలాల్లో కూడా పీచుపదార్థం ఉంటుంది. బీ3, బీ5, బీ6, బీ9 మొదలైన విటమిన్లు, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్‌, జింక్‌ వంటి ఖనిజాలు కూడా లభిస్తాయి. అధిక పిండి పదార్ధాలుండడం వల్ల మధుమేహం ఉన్నవారు వివిధ రకాల ధాన్యాలతో పాటు మొక్కజొన్నను పరిమిత మోతాదులోనే తీసుకోవాలి. బేబీ కార్న్‌లోనూ ఇవే పిండిపదార్ధాలు ఉంటాయి. ప్రోటీన్లు, పీచు పదార్ధాలు ఎక్కువ. కొవ్వులు చాలా తక్కువ. బేబీ కార్న్‌లో థయామిన్‌, రిబోఫ్లావిన్‌, ఫోలిక్‌ ఆసిడ్‌, నయాసిన్‌ వంటి బీ విటమిన్లు ఉండడం వలన ఇవి శక్తినిచ్చే ఆహారంగా ఉపయోగపడతాయి. వీటిలోని సి విటమిన్‌ రోగనిరోధక శక్తిని పెంచడానికి ఎంతో ఉపయోగపడుతుంది. వీటిని కూరల్లో కానీ, మిగతా కూర గాయలతో కలిపి స్టిర్‌ ఫ్రై లా చేసుకుంటే అన్ని పోషకాలు అలాగే ఉంటాయి. కానీ నూనెలో డీప్‌ ఫ్రై చేస్తే మాత్రం కొన్ని పోషకాలు పోతాయి. పిల్లలకు ఇది మంచి స్నాక్‌లా వాడవచ్చు. మొక్కజొన్నల కంటే బేబీ కార్న్‌లో పిండి పదార్ధాలు తక్కువ ఉండడం వల్ల ఇవి కూరగాయలతో సమంగా వాడుకోవచ్చు. అన్ని వయసులవారు తినవచ్చు. పీచు పదార్ధాలు ఎక్కువగా ఉండడం వలన జీర్ణాశయ ఆరోగ్యానికి, రక్తంలో చక్కర స్థాయి అదుపులో ఉంచడానికి కూడా ఉపయోగపడుతుంది. 


డా. లహరి సూరపనేని
న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్
nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను [email protected]కు పంపవచ్చు)
Advertisement

ఆహారం-ఆరోగ్యంమరిన్ని...

Advertisement

ప్రత్యేకం మరిన్ని...