ఆదివాసీలను విస్మరిస్తే ప్రత్యేక రాష్ట్రం కోసంపోరాటం

ABN , First Publish Date - 2022-08-10T05:21:30+05:30 IST

ఆదివాసీలను విస్మరిస్తే ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేస్తామని అదిలాబాద్‌ ఎంపీ సోయం బాబూరావు హెచ్చరించారు.

ఆదివాసీలను విస్మరిస్తే ప్రత్యేక రాష్ట్రం కోసంపోరాటం
జూలూరుపాడులో కొమరం భీమ్‌ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న ఎంపీ సోయం బాబూరావు

పట్టాలిస్తానని చెప్పి సీఎం మాట తప్పారు

అధికారులు కేసులు పెడితే ఊరుకోవద్దు

ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాబూరావు

ఏన్కూరు, జూలూరుపాడులో ఆదివాసీ దినోత్సవం

ఏన్కూరు/ జూలూరుపాడు, ఆగస్టు9: ఆదివాసీలను విస్మరిస్తే ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేస్తామని అదిలాబాద్‌ ఎంపీ సోయం బాబూరావు హెచ్చరించారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మంగళవారం ఏన్కూరు, జలూరుపాడులో వేడుకలు నిర్వహించారు. కొమురంభీం విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. అనంతరం ఆదివాసీ జెండాను ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో పోడుహక్కుదారులు అందరికి పట్టాలు ఇస్తానని స్వయంగా కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటించి సర్వేలు పేరుతో ఆదివాసీలను మోసం చేస్తున్నారని విమర్శించారు. సమావేశంలో రామకృష్ణ, ఎంపీపీ ఆరెం వరలక్ష్మి, రామయ్య, బొర్రా తిరుప తయ్య, సుధీర్‌, బాలరాజు,నాగరాజు, లక్ష్మణ్‌, శ్రీకాంత్‌, దిలీప్‌, రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.

అధికారులను ప్రతిఘటించండి

జూలూరుపాడులో ఏర్పాటు చేసిన సభలో బాబూరావు మాట్లాడుతూ పోడు వ్యవసా యం చేయకుండా అధికారులు కేసులు పెడితే తిరిగి వారిపై కేసులు పెట్టాలని ఆదివా సీలకు పిలుపునిచ్చారు. 2004వ సంవత్సరం కన్న ముందు పోడు భూములను సాగు చేసుకుంటున్న గిరిజనులందరికి హక్కు పత్రాలు ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్రమోధీ సీఎం కేసీఆర్‌కు లేఖ రాస్తే ఇప్పటి వరకు స్పందన లేదన్నారు. ఆనాడు కొమరం భీమ్‌ నైజాం ప్రభుత్వంపై దాడి చేస్తేనే దిగి వచ్చిందని, ఆదివాసీలు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దాడి చేస్తేనే హక్కు పత్రాలు అందుతాయని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి, రామకృష్ణ, వీరమల్లు, సీతారాములు, నరసింహా రావు దొర, శ్రీరామ్‌, సీతాకుమారి, వీరభద్రం, సర్పంచ్‌లు కళాశ్రీ, మోహన్‌రావు, సావిత్రి, నరసింహా రావు, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-10T05:21:30+05:30 IST