Abn logo
Oct 19 2021 @ 15:25PM

ఎంపీ పదవికి రాజీనామా చేసిన బాబుల్ సుప్రియో

న్యూఢిల్లీ: బీజేపీ మాజీ నేత బాబుల్ సుప్రియో మంగళవారంనాడు లాంఛనంగా తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. తనపై విశ్వాసం ఉంచిన బీజేపీ నాయకత్వానికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. నెల రోజుల క్రితమే ఆయన మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో చేరారు.

''నా రాజకీయ జీవితం బీజేపీతోనే ప్రారంభించినందున హృదయం బరువెక్కింది. ప్రధానికి, పార్టీ అధ్యక్షుడికి, అమిత్‌షాకు నా ధన్యవాదాలు. వారు నాపై ఎంతో నమ్మకం ఉంచారు. మనస్ఫూర్తిగానే రాజకీయాల నుంచి వైదొలిగాను. పార్టీలో ఉండనప్పుడు ఎంపీ సీటులో కొనసాగడం సరికాదని భావించాను'' అని లోక్‌సభ స్పీకర్ ఓం  బిర్లాను కలిసిన అనంతరం బాబుల్ సుప్రియో మీడియాతో మాట్లాడుతూ అన్నారు. సెప్టెంబర్ 20న టీఎంసీలో చేరిన అనంతరం లోక్‌సభ స్పీకర్‌కు సుప్రియో లేఖ రాస్తూ, ఎంపీ పదవికి లాంఛనంగా రాజీ చేసేందుకు వీలుగా అపాయింట్‌మెంట్ ఇవ్వాల్సిందిగా ఆయనను కోరారు.

ఇవి కూడా చదవండిImage Caption