Abn logo
Sep 30 2020 @ 11:58AM

మధ్యాహ్నం 12 గంటలకు బాబ్రీ తీర్పు

లఖ్‌నవ్: వివాదాస్పద కట్టడం బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు మధ్యాహ్నం 12 గంటలకు తీర్పు వెలువరించనుంది. సీబీఐ ప్రత్యేక కోర్టుకు జడ్జి ఎస్.కే.యాదవ్ చేరుకున్నారు. కోర్టుకు సాక్షి మహరాజ్, సాధ్వి రితంబరా, వినయ్ కటియార్, ధరమ్‌దాస్, వేదాంతి, లల్లూ సింగ్, చంపత్‌రాయ్, పవన్ పాండే సహా 26 మంది చేరుకున్నారు.  ప్రధాన నిందితులుగా ఉన్న బీజేపీ సీనియర్ నేతలు అడ్వాణీ, జోషి, ఉమా భారతి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తీర్పు సమయానికి హాజరుకానున్నారు. కరోనాతో కోర్టుకు హాజరు కాలేకపోతున్నానని ఉమా భారతి తెలిపారు. తీర్పు నేపథ్యంలో సీబీఐ ప్రత్యేక కోర్టు దగ్గర పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. 

Advertisement
Advertisement
Advertisement