Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Thu, 28 Apr 2022 12:10:33 IST

బార్క్‌లో 266 పోస్టులు

twitter-iconwatsapp-iconfb-icon
బార్క్‌లో 266 పోస్టులు

భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న బాబా అటామిక్‌ రిసెర్చ్‌ సెంటర్‌ (బార్క్‌) పరిధిలోని న్యూక్లియర్‌ రీసైకిల్‌ బోర్డుల్లో(తారాపూర్‌, కల్పకం) కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

1. స్టయిపెండరీ ట్రెయినీలు కేటగిరీ-1

ఖాళీలు:71

విభాగాలు: కెమిస్ట్రీ, కెమికల్‌, మెకానికల్‌, సివిల్‌, ఎలక్ట్రికల్‌, ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌

అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ డిప్లొమా, బీఎస్సీ(కెమిస్ట్రీ) ఉత్తీర్ణత.

వయసు: దరఖాస్తు తేదీ ముగిసేనాటికి 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి

స్టయిపెండ్‌: మొదటి ఏడాది నెలకు రూ.16,000, రెండో ఏడాది నెలకు రూ.18,000 చెల్లిస్తారు

2. స్టయిపెండరీ ట్రెయినీలు కేటగిరీ-2

ఖాళీలు: 189

ట్రేడులు: ఏసీ మెకానిక్‌, ఎలక్ట్రీషియన్‌, ఎలకా్ట్రనిక్‌ మెకానిక్‌, ఫిట్టర్‌, టర్నర్‌, వెల్డర్‌, ప్లాంట్‌ ఆపరేటర్‌ తదితరాలు

వయసు: దరఖాస్తు చివరి తేదీ నాటికి 18 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి

స్టయిపెండ్‌: మొదటి ఏడాది నెలకు రూ.10,500, రెండో ఏడాది నెలకు రూ.12,500 చెల్లిస్తారు

ఎంపిక: రాత పరీక్ష(ప్రిలిమినరీ టెస్ట్‌, అడ్వాన్స్‌డ్‌ టెస్ట్‌, స్కిల్‌ టెస్ట్‌), ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

3. సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ బి(సేఫ్టీ)

ఖాళీలు: 01

అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఇంజనీరింగ్‌ డిప్లొమా/బీఎస్సీ ఉత్తీర్ణత.

వయసు: 19 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి

జీతభత్యాలు: నెలకు రూ.35,400 చెల్లిస్తారు

4.టెక్నీషియన్‌ బి(లైబ్రరీ సైన్స్‌)

ఖాళీలు:01

అర్హత: పదో తరగతి/ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మేథ్స్‌ సబ్జెక్టులతో ఇంటర్‌ ఉత్తీర్ణత. లైబ్రరీ సైన్స్‌ సర్టిఫికెట్‌ ఉండాలి.

వయసు: దరఖాస్తు చివరి తేదీ నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి

జీతభత్యాలు: నెలకు రూ.21,700 చెల్లిస్తారు

5.టెక్నీషియన్‌- బి(రిగ్గర్‌)

ఖాళీలు:04

అర్హత: పదో తరగతి/ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మేథ్స్‌ సబ్జెక్టులతో ఇంటర్‌ ఉత్తీర్ణత. రిగ్గర్‌ ట్రేడ్‌ సర్టిఫికెట్‌ ఉండాలి.

వయసు: దరఖాస్తు చివరి  తేదీ నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి

జీతభత్యాలు: నెలకు రూ.21,700 చెల్లిస్తారు

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్‌ 30

వెబ్‌సైట్‌: https://nrbapply. formflix.com/home

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement

జాతీయం Latest News in Teluguమరిన్ని...

క్రీడాజ్యోతిLatest News in Telugu మరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.