ఘనంగా ఆజాదీకా అమృత్‌ మహోత్సవం

ABN , First Publish Date - 2022-08-12T06:19:59+05:30 IST

అఖిలభారతీయ విద్యార్ధి పరిషత్‌ (ఏబీవీపీ) ఆధ్వర్యంలో గురువారం గిద్దలూరు పట్టణంలో ఆజాదీకా అమృత మహోత్సవాలు నిర్వహించారు.

ఘనంగా ఆజాదీకా అమృత్‌ మహోత్సవం
గిద్దలూరులో భారీ జాతీయ జెండాలతో ప్రదర్శన

గిద్దలూరు టౌన్‌, ఆగస్టు 11 : అఖిలభారతీయ విద్యార్ధి పరిషత్‌ (ఏబీవీపీ) ఆధ్వర్యంలో గురువారం గిద్దలూరు పట్టణంలో ఆజాదీకా అమృత మహోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఎస్‌ఐ బ్రహ్మనాయుడు ప్రారంభించార. ఏబీవీపీ జిల్లా కన్వీనర్‌ శ్రీకాంత్‌ మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకోవాలన్నారు. కార్యక్రమంలో గిద్దలూరు కన్వీనర్‌ జై, ఆర్‌ఎస్‌ఎస్‌ జిల్లా సహశారీరక ప్రముఖ్‌ రంగస్వామి, రాష్ట్ర టెక్నికల్‌సెల్‌ కన్వీనర్‌ జనార్థన్‌, సంజు, గణేష్‌, కళ్యాణ్‌రాజు పాల్గొన్నారు.

నగర పంచాయతీ ఆధ్వర్యంలో: ‘హర్‌గర్‌ త్రిరంగ ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని కోరుతూ నగర పంచాయతీ కార్యాలయం నుంచి తహసీల్దార్‌ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. తహసీల్దార్‌ ప్రేమ్‌కుమార్‌, మున్సిపల్‌ కమిషనర్‌ రామక్రిష్ణయ్య, టౌన్‌ప్లానింగ్‌ ఆఫీసర్‌ సతీష్‌కుమార్‌, సీనియర్‌ అసిస్టెంట్లు ఖాదర్‌వలి, ఇసామియా, వంశీకృష్ణ పాల్గొన్నారు.

త్రిపురాంతకం : వాసవీ క్లబ్‌ ఆద్వర్యంలో స్థానిక జడ్పీ పాఠశాల విద్యార్ధులతో 201 అడుగుల జాతీయ జెండాను ప్రదర్శిస్తూ పోలీసుస్టేషను, ఎన్నెస్పీ కాలనీ ఆర్టీసీ బస్టాండు, మీదుగా ఉత్తరపుబజారు, పాత రామాలయం నుండి వైపాలెం కూడలి మీదుగా ప్రధాన రహదారిపై హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సర్సంచ్‌ పివి.లక్ష్మీ, ఉపసర్పంచ్‌ కృష్ణారెడ్డి, వాసవీక్లబ్‌ ప్రతినిధులు మధు, కేశవులు, సోమశేఖర్‌, ఉపాద్యాయులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

తర్లుపాడు : అజాదీకా అమృత మహోత్సవాల్లో భాగంగా అధికారులు, ప్రజాప్రతినిధులు విద్యార్థులు కలిసి తర్లుపాడు బస్టాండ్‌ సెంటర్‌లో మానవహారం,, గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఎంపీపీ సూరెడ్డి భూలక్ష్మీ, సర్పంచ్‌ పల్లెపోగు వరాలు,  వెలుగు ఏపీఎం డి.పిచ్చయ్య, పంచాయతీ కార్యదర్శి అచ్యుత్‌రావు,  సచివాలయ సిబ్బంది, నెహ్రూ యూత్‌ అధ్యక్షుడు .పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు. 

పొదిలి రూరల్‌ : పొదిలి పోలీస్‌ స్టేషన్‌లో సిఐ సుధాకర్‌ ఆధ్వర్యంలో గురువారం ఆజాదీకా అమృత్‌ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా ప్రముఖుల పోటోలకు పూలమాలలు వేసి నివాళు లర్పించారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఐ శ్రీహరి, సిబ్బంది పాల్గొన్నారు.

ఎర్రగొండపాలెం : ఎర్రగొండపాలెం ప్రభుత్వ బీసీ పాఠశాలలో ఆవరణలో ఉన్న మహానీయుల విగ్రహాలకు పాలాభిషేకం చేశారు. త్రివర్ణపతాక ప్రదర్శనలతో  గురువారం ఎంఈవో పి.ఆంజనేయులు, ఎస్‌ఐ జి.కోటయ్య, హైస్కూల్‌ హెచ్‌.ఎం శామ్యూల్‌జాన్‌ ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయులు, సిఆర్‌ఫీలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మార్కాపురం(వన్‌టౌన్‌) : స్థానిక మున్సిపల్‌  కార్యాలయంలో కమిషనర్‌ గిరకుమార్‌ దేశ నాయకుల విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. మున్సిపల్‌  సిబ్బంది, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొ న్నారు. స్థానిక ఎస్‌వీకేపీ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.  భాష్యం పాఠశాల ప్రిన్సిపాల్‌ నాగరాజు ఆధ్వర్యంలో అమృత్‌ మహోత్సవం కార్యక్రమం నిర్వహించారు.

Updated Date - 2022-08-12T06:19:59+05:30 IST