న్యూఢిల్లీ, జనవరి 26: గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఉత్తరప్రదేశ్ శకటం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అయోధ్యలో నిర్మించనున్న రామమందిర నమూనాను దీనిపై ప్రదర్శించడం విశేషం. దీపోత్సవం, రామాయణ కథలతో పాటు మహర్షి వాల్మీకికి చెందిన భారీ విగ్రహాన్ని శకటంపై ఏర్పాటు చేశారు.