LIVE: అయోధ్య రామమందిరం భూమి పూజ

ABN , First Publish Date - 2020-08-05T15:00:24+05:30 IST

LIVE: అయోధ్య రామమందిరం భూమి పూజ

LIVE: అయోధ్య రామమందిరం భూమి పూజ

అయోధ్య: అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ఈరోజు మధ్యాహ్నం భూమిపూజ జరుగనుంది. ప్రధాని మోదీ స్వయంగా హాజరై.. గర్భగుడి ప్రాంతంలో 40 కిలోల వెండి ఇటుకను స్థాపించనున్నారు. తద్వారా ఆలయ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. మధ్యాహ్నం 12 గంటల 44 నిమిషాల 8 సెకన్ల నుంచి 12 గంటల 44 నిమిషాల 40 సెకన్లదాకా.. అంటే 32 సెకన్లలోపు ఈ కార్యక్రమం పూర్తవుతుంది. శంకుస్థాపనకు సకలసన్నాహాలు పూర్తయ్యాయి. సోమవారమే మొదలైన పూజలు.. భూమిపూజతో బుధవారం మధ్యాహ్నం పూర్తవుతాయి. శంకుస్థాపనకు ఎలాంటి అవరోధాలు కలగకుండా 12 మంది పురోహితులు విఘ్నేశ్వరుడికి పూజాదికాలు నిర్వహించారు. మంగళవారం ఉదయం 9 గంటలకు 21 మంది పురోహితులు వేద పఠనం ఆరంభించారు. రామాచార్య పూజ చేశారు.


రుతుపవనాల ప్రభావంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. అయోధ్య ప్రాంతంలోనూ కురుస్తాయన్న సమాచారంతో రామజన్మభూమి ప్రాంతంలో భారీ రెయిన్‌ ప్రూఫ్‌ టెంట్‌ వేశారు. భూమిపూజ జరిగే ప్రధాన స్థలం వెనుక భారీ టీవీ స్ర్కీన్‌ ఏర్పాటు చేశారు. జరిగే క్రతువునంతా దాని ద్వారా చూడవచ్చు. ప్రధాని మోదీ, ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత మోహన్‌ భాగవత్‌ పేరు, అనంతరం యూపీ గవర్నర్‌ ఆనందిబెన్‌ పటేల్‌, శ్రీరామజన్మభూమి తీర్థ్‌ క్షేత్ర ట్రస్టు చైర్మన్‌ మహంత నృత్యగోపాల్‌ దాస్‌, సీఎం యోగి ఆదిత్యనాథ్‌ పేర్లు ప్రదర్శిస్తారు. అయోధ్య భూమి పూజను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించండి.

Updated Date - 2020-08-05T15:00:24+05:30 IST