సరయూ ఘాట్‌కు రంగులద్దనున్న ఫ్రాన్స్ కళాకారుడు

ABN , First Publish Date - 2021-09-18T16:24:42+05:30 IST

దేశ సంస్కృతిలో రామాయణం ఒక భాగం. ఇది...

సరయూ ఘాట్‌కు రంగులద్దనున్న ఫ్రాన్స్ కళాకారుడు

అయోధ్య: దేశ సంస్కృతిలో రామాయణం ఒక భాగం. ఇది ఎవరూ కాదనలేని సత్యం. రామాయణం ఖ్యాతి మన దేశంలోనే కాకుండా దేశదేశాలకూ వ్యాపించింది. రామనగరి అయోధ్యలోని సరయూ ఘాట్ వద్ద శ్రీరాముని జీవిత సందేశాలను ఫ్రాన్స్‌కు చెందిన యువ కళాకారుడు షిఫుమీ చిత్రీకరిస్తున్నాడు. అయోధ్యలో దీపోత్పవానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీపోత్సవాన ఏకంగా 7.5 లక్షల దీపాలను వెలిగించి కొత్త రికార్డు నెలకొల్పేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ పనులలో ఫ్రాన్స్‌కు చెందిన కళాకారుడు షిఫుమీ పాలుపంచుకుంటున్నాడు. వాల్ పెయింటింగ్‌తో పాటు మయూరల్ ఆర్ట్ వర్క్ చేస్తున్నాడు. ఈ సందర్భంగా షిపుమీ మాట్లాడుతూ తాను రామాయణం చదివానని, రామకథ తనకు తెలుసని, సరయూ నది రాముని జీవితంలో ఒక భాగమని అన్నారు. 


Updated Date - 2021-09-18T16:24:42+05:30 IST