లోక్‌ అదాలత్‌పై అవగాహన

ABN , First Publish Date - 2021-10-20T04:36:36+05:30 IST

లోక్‌ అదాలత్‌పై అవగాహన

లోక్‌ అదాలత్‌పై అవగాహన
లోక్‌అదాలత్‌పై అవగాహన కల్పిస్తున్న సర్పంచ్‌ రాజిరెడ్డి

దోమ: పరిగి మున్సిఫ్‌కోర్టు ఆధ్వర్యంలో నిర్వహించే లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్‌ రాజిరెడ్డి  గ్రామస్థులకు మంగళవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  క్షణికావేషానికి లోనై చిన్నచిన్న సమస్యలతో కోర్టుల చుట్టూ తిరిగి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్‌, కోర్టు సిబ్బంది రాములు, హబీజ్‌, గ్రామస్థులు శ్యామారెడ్డి, క్రిష్ణయ్య, బాల్‌రెడ్డి, వెంకటయ్య, దస్తయ్య పాల్గొన్నారు. అదేవిధంగా గ్రామంలో ఇళ్ల నుంచి సేకరించిన వ్యర్థ పదార్థాల ద్వారా వర్మీకంపోస్టు తయారు చేయడంపై సర్పంచ్‌ రాజిరెడ్డి మహిళలకు అవగాహన కల్పించారు. తడి, పొడి చెత్తను వేరు చేయాలని సూచించారు. కార్యక్రమంలో మహిళలు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-20T04:36:36+05:30 IST