సమావేశంలో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్ కుమార్ దీపక్
- అదనపు కలెక్టర్ కుమార్ దీపక్
కోల్‌సిటీ, నవంబరు 30: లే అవుట్లు, భవన నిర్మాణ అనుమతుల విషయంలో ప్రజల్లో అవగాహన పెంపొందించాలని జిల్లా అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) కుమార్ దీపక్ ఆదేశించారు. మంగళవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో జిల్లా టాస్క్‌ఫోర్స్ కమిటీ సభ్యులతో ఆయన సమావేశం నిర్వహించారు. అనుమతి లేని కట్టడాలు, అనధికారిక లే అవుట్ల విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. లే అవుట్ భవన నిర్మాణ అనుమతులకు నిబంధనలు అనుసరించి దరఖాస్తు చేసుకున్న వారికి నిర్ణీత గడువులోగా అనుమతి మంజూరు చేయాలన్నారు. రోడ్లు, మురుగు నీటి కాలువలపై నిర్మించిన అక్రమ నిర్మాణాలను తొలగించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ మాతంగి శ్రీనివాస్, సూపర్‌వైజర్లు శ్యామ్, సతీష్, డిప్యూటీ తహసిల్దార్ వరలక్ష్మి, కిరణ్‌కుమార్, ఫైర్ ఆఫీసర్ సత్యనారాయణ పాల్గొన్నారు.