జంతువుల కోసం కూలర్లు.. రాజస్థాన్ పార్క్‌లో ఏర్పాటు

ABN , First Publish Date - 2020-05-16T23:23:34+05:30 IST

వేసవి కాలం కావడంతో రాజస్థాన్‌ మండిపోతోంది. ఈ నేపథ్యంలో అక్కడి నేషనల్ పార్కుల్లోని జంతువులు కూడా...

జంతువుల కోసం కూలర్లు.. రాజస్థాన్ పార్క్‌లో ఏర్పాటు

జైపూర్: వేసవి కాలం కావడంతో రాజస్థాన్‌ మండిపోతోంది. ఈ నేపథ్యంలో అక్కడి నేషనల్ పార్కుల్లోని జంతువులు కూడా వేసవి తాపం తట్టుకోలేకపోతున్నాయి. వేసవి తాపం నుంచి వాటిని రక్షించేందుకు స్థానిక మచియా పార్క్ యాజమాన్యం కూలర్లను ఏర్పాటు చేసింది. ముఖ్యంగా పెద్దపులి, చిరుతపులులు ఉన్న షెల్టర్ల వద్ద ఈ కూలర్లను ఉంచింది. మిగిలిన జంతువుల షెల్టర్ల వద్ద కూడా కూడా కూలర్లతో పాటు, ఫ్యాన్లను ఏర్పాటు చేసింది. ‘జంతువుల షెల్టర్లలో ఎప్పటికప్పుడు  నీటిని చల్లుతున్నాం.. పలు చోట్ల కూలర్లను ఏర్పాటు చేశాం. వేసవి నుంచి వాటిని రక్షించడానికి తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నాం’ అని అక్కడి రక్షణాధికారి శ్రావణ్ సింగ్ తెలిపారు. 


ఇదిలా ఉంటే రాజస్థాన్‌లోని అనేక ప్రాంతాల్లో ప్రస్తుతం 41 నుంచి  44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత ఉన్నట్లు జాతీయ వాతావరణ విభాగం తెలిపింది. మే 19, 20 తేదీల్లో ఈ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని, ఇతర ప్రాంతాల్లోనూ ఉష్ణోగ్రత పెరగవచ్చని వివరించింది.

Updated Date - 2020-05-16T23:23:34+05:30 IST