Advertisement
Advertisement
Abn logo
Advertisement

సరిగ్గా 2 నెలల క్రితం పెళ్లి.. ఆఫీసుకు వెళ్లిన కొడుకు.. కోడలి గదిలోంచి శబ్దాలు రావడంతో అనుమానంతో వెళ్లి చూసిన అత్తమామలకు..

కొడుక్కి పెళ్లి చేసి.. మనుమళ్లు పుడితే వారితో కాలక్షేపం చేస్తూ జీవితం గడిపేయాలని తల్లిదండ్రులు ఆశిస్తుంటారు. ఇలాగే తిరువనంతపురంలో తల్లిదండ్రులు తమ కొడుక్కు పెళ్లి చేశారు. కొడుకు, కోడలు కలిసి అన్యోన్యంగా కాపురం చేస్తున్నారు. ఇది చూసిన తల్లిదండ్రులకు ఎంతో ఆనందం కలిగింది. అయితే రెండు నెలల తర్వాత ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఓ రోజు కోడలి గదిలోంచి శబ్దాలు వచ్చాయి. ఏంటా అని వెళ్లి చూసిన వారు.. షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే..

తిరునంతపురం జిల్లా ఆర్యనాడ్ అనే గ్రామానికి చెందిన ఆద్య(23)కు ఆదిత్య అనే యువకుడితో ఆగస్టులో వివాహమైంది. అప్పటి నుంచి సంసారం సాఫీగా సాగుతూ వచ్చింది. కోడలిని అత్తమామలు కూడా బాగా చూసుకునేవారు. త్వరలో మనుమడో, మనుమరాలో పుడితే.. వారితో కాలక్షేపం చేయాలనే ఆశలో అత్తమామలు ఉన్నారు. ఈ క్రమంలో ఓ రోజు ఆదిత్య ఆఫీసుకు వెళ్లగా.. ఆద్య ఒక్కటే ఉంది. అందరితో కలిసి భోజనం చేసి గదిలోకి వెళ్లింది. అయితే కొద్దిసేపటికి.. ఏవో శబ్దాలు వినిపించాయి. దీంతో అత్తమామలు కంగారుపడి కోడలిని పిలిచారు. అయినా ఆమె పలకలేదు.

ఎంతసేపటికీ కోడలి నుంచి సమాధానం రాకపోవడంతో తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు. అయితే అప్పటికే ఆద్య.. ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు తెలిపారు. ఎప్పుడూ సంతోషంగా ఉండే తమ కోడలు.. ఉన్నట్టుండి ఇలా చేసుకుంటుందని ఊహించలేదని అత్తమామలు బోరున విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని విచారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆమె ఆత్మహత్య వెనుక వేధింపులా, లేక గతంలో ఏదైనా ప్రేమ వ్యవహారం ఉందా.. అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement