కళ్లలో కారం చల్లి హత్యాయత్నం

ABN , First Publish Date - 2021-10-28T06:13:25+05:30 IST

కళ్లలో కారంపొడి చల్లి తనను హ తమార్చేందుకు వైసీపీ నేత మాధవరెడ్డి కిరాయి గూండాలతో దాడి చే యించాడని లోక్‌సత్తా పార్టీ జిల్లా అధ్యక్షుడు వెంకటరమణ (బాబు) ఆరోపించారు.

కళ్లలో కారం చల్లి హత్యాయత్నం
వెంకటరమణ ఇంటి వద్ద విచారిస్తున్న సీఐ సురేష్‌ బాబు

పట్టపగలు లోక్‌సత్తా జిల్లా అధ్యక్షుడిపై దాడి 

వైసీపీ నేత మాధవరెడ్డి కుట్ర పన్నాడని ఆరోపణ


రాయదుర్గంటౌన, అక్టోబరు 27: కళ్లలో కారంపొడి చల్లి తనను హ తమార్చేందుకు వైసీపీ నేత మాధవరెడ్డి కిరాయి గూండాలతో దాడి చే యించాడని లోక్‌సత్తా పార్టీ జిల్లా అధ్యక్షుడు వెంకటరమణ (బాబు) ఆరోపించారు. బాధితుడు బుధవారం స్థానికంగా విలేకరులతో తెలిపిన వివరాలివి. పట్టణంలోని లక్ష్మీబజారులో ద్విచక్రవాహనంలో వెళ్తున్న వెంకటరమణపై పల్సర్‌ ద్విచక్రవాహనంలో వచ్చిన ముగ్గురు వ్యక్తులు కళ్లలో కారంపొ డి చల్లారు. ద్విచక్రవాహనాన్ని ఆపి, కళ్లు నలుపుకోవడానికి ప్రయత్నిస్తుండగా కర్రలతో దాడి చేశారు. శరీరంపై దెబ్బలు తగిలాయని బాధితుడు వా పోయాడు. చాకచక్యంగా పరుగులు తీస్తూ ఇంటికి చేరినట్లు తెలిపాడు. దీంతో ప్రాణాలను కాపాడుకోగలిగానని ఆవేదన వ్యక్తంచేశాడు. హత్యాయత్నంపై డయల్‌ 100 నెంబర్‌కు ఫోన చేసి, ఫిర్యాదు చేశానన్నారు. పట్టపగ లు పట్టణ నడిబొడ్డున తనను హత్య చేసేందుకు వైసీపీ నేత మాధవరెడ్డి పథకం రచించాడని ఆరోపించాడు. గాంధీ మున్సిపల్‌ పాఠశాల వద్ద ప్రభు త్వ మున్సిపల్‌ స్థలాన్ని ఆక్రమించుకుని వైసీపీ నేత మాధవరెడ్డి ఇంటి ని ర్మాణం చేపడుతున్నట్లు తెలిపాడు. దానిపై ఇటీవల ఓ పత్రికలో ఆయనకు వ్యతిరేకంగా కథనం ప్రచురితమైందన్నాడు. అందుకు తానే కారణమని భా వించి, జీర్ణించుకోలేక హతమార్చేందుకు పన్నాగం పన్నాడన్నారు. చాకచక్యంగా వ్యవహరించి, ప్రాణాలను కాపాడుకోగలిగానన్నాడు. మాధవరెడ్డి.. కిరాయి గూండాలను తనపై ఉసిగొల్పి, హత్య చేసేందుకు ప్రయత్నించాడ ని అర్బన సీఐ సురేష్‌ బాబుకు ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. మాధవరెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని వాపోయాడు. బాధితుడి ఫిర్యాదుపై అ ర్బన సీఐ సురే్‌షబాబు విచారణ చేపట్టారు. లక్ష్మీబజారులో దాడికి సంబంధించి సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించి, నిందితులను గుర్తించే దిశగా దర్యాప్తు సాగిస్తున్నారు.


దాడి దుర్మార్గం : కాలవ

అధికార వైసీపీ అక్రమాలకు అడ్డుపడుతున్నాడనే కక్షతో లోక్‌సత్తా పార్టీ జిల్లా అధ్యక్షుడు వెంకటరమణపై పట్టపగలు ప్రధాన రహదారిపై దాడికి తెగపడటం దుర్మార్గమని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కా లవ శ్రీనివాసులు విమర్శించారు. వెంకటరమణపై దాడి విషయాన్ని తెలుసుకున్న ఆయన బుధవారం ఫోన్లో మాట్లాడారు. భౌతిక దాడులకు భయపడొద్దని ధైర్యం నూరిపోశారు. వైసీపీ నాయకుడు మాధవరెడ్డి ప్రభుత్వ స్థలంతోపాటు రోడ్డును ఆక్రమించుకుని నిర్మిస్తున్న ఇంటి విషయంలో వెంకటరమణపై కక్ష పెంచుకుని, దాడి చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ప్రశాంతమైన రాయదుర్గంలో పట్టపగలు ప్రజలు స్వేచ్ఛగా తిరగలేని దుస్థితిని వైసీపీ గూండాలు కల్పించారని దుయ్యబట్టారు. ప్రభుత్వ విప్‌ కాపు రా మచంద్రారెడ్డి ఒత్తిడితో మాధవరెడ్డి అక్రమ నిర్మాణంపై అధికారులు చర్య లు తీసుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందన్నారు. నియోజకవర్గం లో వైసీపీ నాయకుల భూకబ్జాలకు అంతులేకుండా పోతోందని మండిపడ్డా రు. ప్రభుత్వ విప్‌ బంధువులు, అనుచరులు.. ప్రజల ఆస్తులను యథేచ్ఛగా దోచేస్తున్నారని, అధికార పార్టీ ఆగడాలపై ఉద్యమిస్తామని హెచ్చరించారు.


Updated Date - 2021-10-28T06:13:25+05:30 IST