ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఆకస్మిక తనిఖీల కలకలం

ABN , First Publish Date - 2020-04-10T10:59:44+05:30 IST

కరోనా లాక్‌డౌ న్‌ వేళ గురువారం నగరంలోని ప్రభుత్వ మద్యం దు కాణాల్లో అధికారుల ఆకస్మిక తనిఖీలు కలకలం రేపా

ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఆకస్మిక తనిఖీల కలకలం

నగరంలో మూడు దుకాణాలపై దాడులు

ఒక దుకాణంలో వెలుగుచూసిన నగదు లావాదేవీల వ్యత్యాసం

మరో బృందానికి పట్టుబడిన మద్యం అక్రమ విక్రేత

పట్టుబడిన వ్యక్తి పాత లైసెన్స్‌దారుడు 


అనంతపురం క్రైం, ఏప్రిల్‌ 9 : కరోనా లాక్‌డౌ న్‌ వేళ గురువారం నగరంలోని ప్రభుత్వ మద్యం దు కాణాల్లో అధికారుల ఆకస్మిక తనిఖీలు కలకలం రేపా యి. పలు దుకాణాల్లో నగదు లావాదేవీల వ్యత్యాసం వెలుగుచూడగా, మద్యం అక్రమ విక్రేతలు పట్టుబడ డం విస్తుగొల్పింది. కలెక్టర్‌ అదేశాల మేరకు ఎక్సైజ్‌ సీ ఐ స్వర్ణలత, రెవెన్యూ అధికారులు బృందంగా నగరంలోని గుత్తిరోడ్డు, ఆర్టీసీ బస్టాండ్‌, నీలిమా థియేటర్‌ స మీపంలోని ప్రభుత్వ మద్యం దుకాణాలపై ఆకస్మిక దాడులు చేశారు. మరో బృందంగా ఎక్సైజ్‌ అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ ధనుంజయ కుమార్‌ నేతృత్వంలో  పలు ప్రాంతాలో తనిఖీలు కొనసాగాయి.


గౌరి థియేట ర్‌ సమీపంలో పాత లైసెన్సుదారుడు శ్రీనివాసరెడ్డి కల్తీ మద్యం అక్రమంగా విక్రయిస్తూ పట్టుబడ్డాడు. రెండు బాటిళ్లతో పాటు నీలిమా థియేటర్‌ సమీపంలోని ప్ర భుత్వ మద్యం దుకాణం తాళంచెవి అతడి వద్ద లభించడంతో అక్కడికి వెళ్లారు. దుకాణానికి వెనుకవైపు ఉ న్న తలుపు తాళంచెవిగా గుర్తించారు. దుకాణంలో మ ద్యం బాటిళ్లు లేక ఖాళీగా కనిపించడంతో అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. పెద్దఎత్తున మద్యం దొంగ చాటుగా విక్రయించారనే అరోపణలు లేకపోలేదు. లా క్‌డౌన్‌ నేపథ్యంలో మద్యం దుకాణంలో పనిచేస్తున్న సి బ్బంది స్టాక్‌ నివేదికతో పాటు తాళాలను ఎక్పైజ్‌ పోలీసులకు అప్పగించారు. దాని ప్రకారం ప్రస్తుతం దుకాణంలో స్టాక్‌ను పరిశీలించగా యఽథావిధిగా ఉన్నట్లు తేలింది. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అ యితే ఆర్థిక లావాదేవీలకు సంబంధించి రూ.8930 న గదు వ్యత్యాసం రావడం చర్చకు దారితీసింది.  దుకా ణం విద్యుత్‌, ఇతర ఖర్చులకు వినియోగించామని, తి రిగి చెల్లిస్తామని సిబ్బంది చెప్పుకొచ్చారు. 


లోతుగా విచారణ 

పట్టుబడిన శ్రీనివాసరెడ్డిని లోతుగా విచారణచేస్తున్నామని ఎక్సైజ్‌ అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ ధనుంజయకుమార్‌ తెలిపారు. ఎక్కడ నుంచి మద్యం తెచి అమ్ముతున్నాడు, ఇంతవరకు ఎంత విక్రయించాడు త దితర వివరాలపై ఆరా తీస్తున్నామన్నారు. నీలిమా థి యేటర్‌ సమీపంలోని మద్యం దుకాణం స్టాకులో ఎ లాంటి వ్యత్యాసం లేదని చెప్పారు. విచారణలో అక్ర మాలు తేలితే ఎంతటివారినైనా ఉపేక్షించమని, చట్టప్ర కారం చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.   


Updated Date - 2020-04-10T10:59:44+05:30 IST