బీజేపీ, ఆర్‌ఎస్ఎస్‌ నేతల ఇళ్లపైనే దాడులు

ABN , First Publish Date - 2022-09-26T16:49:54+05:30 IST

రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా బీజేపీ, ఆర్‌ఎ్‌సఎస్‌ నేతల ఇళ్ళపైనే వరుసగా పెట్రోలు బాంబు దాడులు జరుగుతున్నాయని, ఇప్పటి వరకూ

బీజేపీ, ఆర్‌ఎస్ఎస్‌ నేతల ఇళ్లపైనే దాడులు

పట్టించుకోని ప్రభుత్వం  

అమిత్‌షాకు అన్నామలై లేఖ

చెన్నై: రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా బీజేపీ, ఆర్‌ఎ్‌సఎస్‌ నేతల ఇళ్ళపైనే వరుసగా పెట్రోలు బాంబు దాడులు జరుగుతున్నాయని, ఇప్పటి వరకూ నేరస్థులను అరెస్టు చేయకుండా డీఎంకే ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై లేఖ రాశారు. ఆదివారం ఉదయం అన్నామలై స్వయంగా ఈ విషయాన్ని ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు.  రాష్ట్రంలో ఇప్పటివరకూ 19 చోట్ల తమ పార్టీకి చెందినవారి ఇళ్ళపై, ఆర్‌ఎ్‌సఎస్‌, హిందూ మున్నాని నేతల ఇళ్లపై దాడులు జరిగిన ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఆ దాడులను ఖండిస్తూ ఇప్పటివరకూ ఓ ప్రకటన కూడా చేయలేదని ఆ లేఖలో ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అధ్వాన్నంగా ఉన్నాయని, విచ్చిన్నకర శక్తులకే రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటోందంటూ తగిన ఆధారాలతో అమిత్‌షాకు ఆ లేఖలో వివరించినట్లు అన్నామలై తెలిపారు.

Updated Date - 2022-09-26T16:49:54+05:30 IST