తీన్మార్‌ మల్లన్నపై దాడికి యత్నం

ABN , First Publish Date - 2020-07-13T20:13:08+05:30 IST

నిజామాబాద్‌ జిల్లా ఇందల్వాయి టోల్‌ప్లాజా వద్ద తీన్మార్‌ మల్లన్న అలియాస్‌ నవీన్‌కుమార్‌పై పలువురు దాడికి యత్నించారు. ఆర్మూ ర్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు

తీన్మార్‌ మల్లన్నపై దాడికి యత్నం

ఇందల్వాయి/నిజామాబాద్ (ఆంధ్రజ్యోతి): నిజామాబాద్‌ జిల్లా ఇందల్వాయి టోల్‌ప్లాజా వద్ద తీన్మార్‌ మల్లన్న అలియాస్‌ నవీన్‌కుమార్‌పై పలువురు దాడికి యత్నించారు. ఆర్మూ ర్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న అభియోగంపై తీన్మార్‌ మల్లన్నపై పీఆర్‌పీసీ 41 చట్టం ప్రకారం ఆర్మూర్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసిన విషయం విదితమే. కాగా, నోటీసులు అందుకున్న మల్లన్న వివరణ ఇచ్చేందుకు ఆదివారం అడ్వకేట్‌తో కలిసి ఆర్మూర్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళుతుండగా ఇందల్వాయి టోల్‌ప్లాజావద్ద డిచ్‌పల్లి సీఐ వెంకటేశ్వర్లు ఆపి ఆర్మూర్‌లో లా అండ్‌ ప్రాబ్లమ్‌ ఉన్నందున ఇందల్వాయి పోలీస్‌స్టేషన్‌కు రావాల్సిందిగా సూచించారు. 


దీంతో మల్లన్న వస్తుండగా కొందరు వ్యక్తులు అకస్మాత్తుగా వచ్చి అతనిపై దాడికి యత్నించారు. వెంటనే పోలీసులు అప్రమత్తమై వారిని అడ్డుకుని అతన్ని ఇందల్వాయి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం అక్కడ మల్లన్న స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. ఆ తర్వాత అడ్వకేట్‌ ఆధ్వర్యంలో తీన్మార్‌ మల్లన్నను పోలీస్‌ రక్షణతో హైదరాబాద్‌కు తరలించారు. తనపై దాడిచేసిన టీఆర్‌ఎస్‌ కార్యకర్తలపై చర్య లు తీసుకోవాలని తీన్మార్‌ మల్లన్న ఇందల్వాయి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏసీపీ శ్రీనివాస్‌కుమార్‌, డీఎస్పీ, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ శివప్రసాద్‌రెడ్డి పర్యవేక్షించారు.  

Updated Date - 2020-07-13T20:13:08+05:30 IST