వ్యాక్సిన్‌ కష్టాలు

ABN , First Publish Date - 2021-05-12T07:10:47+05:30 IST

కరోనా టీకాకు కొత్త ని బంధనలు జనానికి కష్టాలు తెచ్చిపెడు తున్నాయి.

వ్యాక్సిన్‌ కష్టాలు
జిల్లా ఆస్పత్రి వ్యాక్సిన్‌ కేంద్రంలో జనం లేక ఖాళీగా కూర్చున్న వైద్య సిబ్బంది

కొత్త నిబంధనలతో తికమక.. అరకొరగా జనం హాజరు

అనంతపురం వై ద్యం, మే 11: కరోనా టీకాకు కొత్త ని బంధనలు జనానికి కష్టాలు తెచ్చిపెడు తున్నాయి. కేవలం రెండో డోసు వారికి మాత్రమే వ్యాక్సిన్‌ వేయాలని, అది కూడా రోజూ వారిగా ముందుగా సమాచారం ఇచ్చిన వారు మాత్రమే ఆ యా కేంద్రాలకు హాజరై టీకా వేయించుకోవాలని నిబంధనల పెట్టడం ఇబ్బందిగా మారిపోయింది. గతంలో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి వెళ్లి వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. ఇప్పు డు మండలానికి మొత్తం కలిపి ఒక చోట కేంద్రం పెట్టారు. దీంతో ఆ మండలంలో ఉన్న వారందరూ రెండో డోసు వేయించుకోవడానికి నిర్దేశిం చిన కేంద్రానికి రావాల్సి ఉంటుంది. అది కూడా ముందుగా సమాచారం ఇచ్చిన వారే హాజరు కావాలి. సరైన సమాచారం లేక మరోవైపు వ్యాక్సిన్‌ కేంద్రం దూరంగా ఉండిపోవడం వల్ల చాలామంది వ్యాక్సిన్‌ వేయించుకోవడానికి హాజరు కాలేదు. జిల్లా కేంద్రంలోను ఇదే పరిస్థితి కనిపించింది. 14 వేల మందికి వేయాలని నిర్ణయించినా అందులో సగం మంది కూడా హాజరు కాలేదని అధికార వర్గాల ద్వారా విశ్వశనీయ సమాచారం. కానీ అధికారులు మాత్రం ఎలాంటి సమస్య లేదని, ఇది బాగుందని చెప్పి తప్పించుకుంటున్నారు. ఏదిఏమైనా కొత్త నిబందనలు వ్యాక్సిన్‌కు కష్టాలు తెచ్చిపెడుతున్నాయి.


Updated Date - 2021-05-12T07:10:47+05:30 IST