‘ఉద్యమమంటే ఉపాధ్యాయులే’... అన్నది ఇక చరిత్రేనా?

ABN , First Publish Date - 2021-04-14T06:47:03+05:30 IST

ఉద్యమమంటే.. ఉపాధ్యాయులదే. తమ డిమాండ్లు, సమస్యలను పోరాడి, సాధించుకోవటంలో ముం దుండేవారు ఉపాధ్యాయ నాయకులు.

‘ఉద్యమమంటే ఉపాధ్యాయులే’... అన్నది ఇక చరిత్రేనా?

నాడు ఉద్యమమంటే.. ఉపాధ్యాయులదే..

నేడు పోరాటానికి జంకుతున్న వైనం

అడుగడుగునా..  టీచర్లకు అవస్థలు

యాప్స్‌, బయోమెట్రిక్‌, ఇతర సమస్యలు

జిల్లాలో 25 నుంచి 35 వరకూ సంఘాలు

ఒకట్రెండు మినహా అన్నీ డీలా

ప్రశ్నిద్దామంటే భయం..

లోపిస్తున్న నాయకత్వం

అనంతపురం విద్య, ఏప్రిల్‌ 13: ఉద్యమమంటే.. ఉపాధ్యాయులదే. తమ డిమాండ్లు, సమస్యలను పోరాడి, సాధించుకోవటంలో ముం దుండేవారు ఉపాధ్యాయ నాయకులు. జిల్లా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఉపాధ్యాయులే ముం దుండి నడిపించారనటంలో అతిశయోక్తి లేదు. జిల్లా విద్యాధికారి (డీఈ ఓ) కార్యాలయ ముట్టడికి పిలుపునిస్తే.. ఆ ప్రాంతం అట్టుడికేది. అలాంటి వారు.. ఇప్పుడేమయ్యారు? టీచర్లకు సమస్యలే లేవా.. అంటే కోకొల్లలు. విపరీతంగా పెరిగాయి. బోధ న కన్నా.. అదనపు విధులతోనే సతమతమవుతున్నారు. బయోమెట్రిక్‌ హాజరు, యాప్‌లతో కుస్తీ పట్టలేకపోతున్నారు. తమ వల్ల కాదు అంటూ విసిగిపోతున్నారు. ఇలాంటి తరుణంలో సమస్యలపై ప్రశ్నించే గొంతుక ఏమైంది? నడిపించే నాయకుడు ఎక్కడున్నాడు? ఉపాధ్యాయ ఉద్యమ నిర్మాతలు ఏమయ్యారు? అనే ప్రశ్నలు ప్రతి టీచర్‌లోనూ ఉదయిస్తున్నాయి. సమస్యలపై పోరాటం చేసి, తమను ఒత్తిడి నుంచి గట్టెక్కించాలని ఆశగా చూస్తున్నారు. అయినా.. ఎవరూ నోరు మెదపట్లేదు. ఉద్యమానికి ఉపక్రమించట్లేదు. నాయకులకు ఏ మైంది? సమస్యలపై మాట్లాడాలంటేనే ప్రభుత్వం ఎక్క డ వేధిస్తుందోనని జంకుతున్నారని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. వేల సంఖ్యలో సభ్యత్వాలున్న సంఘాలు సైతం ఉద్యమించడానికి వెనకడుగు వేస్తున్నాయంటే.. ఆశ్చర్యపోనక్కరలేదు.మొత్తంపై ఈ రెండేళ్ల లో ఉపాధ్యాయ సంఘాలు, నేతల ఉద్యమ స్వరం మారుతోందన్న వాదనలు వ్యక్తమవుతున్నాయి.


సమస్యలు చుట్టు ముట్టినా...

ఉపాధ్యాయులను సమస్యలు తీవ్రం గా చుట్టుముట్టాయి. ఎన్నడూలేని విధంగా విద్యాశాఖ ఏకపక్ష నిర్ణయాలతో అన్ని సంఘాలూ విసిగిపోయాయి. ఆఖరుకు అధికార పార్టీకి అనుబంధంగా నడిచే ఉపాధ్యాయ సంఘం నుంచి అధికార పక్షంగా చెప్పుకుని బలమైన సంఘాలు సైతం నేడు నోరుమెదపలేని దుస్థితి. ప్రస్తుం టీచర్ల యాప్స్‌, విద్యార్థుల హాజరు, బయోమెట్రిక్‌, హేతుబద్దీకరణ సమస్యలు, జీతాల పెండింగ్‌ వంటి సమస్యలతోపాటు, దీర్ఘకాలికంగా సీపీఎస్‌ రద్దు, పీఆర్సీ తదితర సమస్యలతో సతమతమవుతున్నారు. యూటీఎఫ్‌, ఏపీటీఎఫ్‌ 1938, ఎస్టీయూ, ఎన్‌టీఎఏ, ఏపీ హెచ్‌ఎంల సంఘం, ఎంఈఓల సంఘం ఏపీటీఎప్‌, వైఎ్‌సఆర్‌టీఎఫ్‌, ఎంటీఎఫ్‌, పీఆర్టీయూ, బీసీటీయూ, ఏపీఎస్టీయూఎస్‌ ఇలా జిల్లాలో సైతం 25 నుంచి 35 సంఘాల వరకూ ఉన్నాయి. ఇందులో కొన్ని కుల సంఘాల ప్రాతికదికన కూడా పురుడుపోసున్నాయనడంలో సందేహం లేదు. ఇందులో ప్రధానంగా 10 సంఘాలు టీచర్ల సమస్యలపై తీవ్రంగా స్పందిస్తుంటాయి. మిగిలినవి తమ, కొందరు నాయకుల ఉనికి కోసం నడుస్తున్నాయన్న వాదనలున్నాయి.


తీరని సమస్యలెన్నో...

వైసీపీ అధికార చేపట్టాక టీచర్ల సమస్యల చిట్టా రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. వచ్చిన వారంలోనే తీరుస్తామన్న సీపీఎస్‌ అలాగే ఉంది. పీఆర్సీ ప్రకటనపై కమిటీల ప్రకటనలు తప్పా.. పరిష్కారం లేదు. కొత్తగా బయోమెట్రిక్‌, విద్యార్థుల హాజరు, యాప్స్‌, హేతుబద్దీకణ, ఇష్టారాజ్యంగా బదిలీలు, పోస్టుల బ్లాక్‌, ఇలా చెప్పుకుంటూ పోతే.. టీచర్ల సమస్యలు అనేకం. ఒక్కటీ పరిష్కారానికి నోటుకోవట్లేదు. గతంలో వారంలో 3, 4 రోజులు ధర్నాలు, నిరసనలతో విద్యాశాఖ కార్యాలయాన్ని చుట్టుముట్టే నాయకులు నేడు కనుమరుగయ్యారు. ఆరు, ఏడు మాసాలకు సైతం స్పందించట్లేదు. కొందరు ఈ రెండేళ్లలో ఏనాడూ సంఘాల జెండా పట్టిన దాఖలాలు లేవు. తమ మిత్రులు, సన్నిహితులైన టీచర్లు, సంఘం సభ్యులు సమస్యలతో బాధపడుతున్నా.  ప్రశ్నించే స్థితిలో సంఘాల నాయకులు లేరన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఒకట్రెండు సంఘాలు మి నహా అన్నీ మౌనం పాటిస్తున్నాయి. ఎక్కడ ప్ర భుత్వం నుంచి ఆంక్షల సంకెళ్లు తమను చుట్టుముడతాయోనన్న భయంతో నేతలు బి క్కుబిక్కుమంటున్నారు. నాటి నాయకత్వం మళ్లీ రావాలనీ, తమ సమస్యలను పరిష్కరించేలా చూడాలని సామాన్య టీచర్లు కోరుతున్నారు.

Updated Date - 2021-04-14T06:47:03+05:30 IST