క్రీడలతో మానసికోల్లాసం

ABN , First Publish Date - 2021-02-27T06:27:53+05:30 IST

క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని ఏసీబీ డీఎస్పీ కులశేఖర్‌ పేర్కొన్నారు. 7వ రాష్ట్రస్థాయి సీనియర్‌ సాఫ్ట్‌బాల్‌ పోటీలు శుక్రవారం స్థానిక అనంత క్రీడాగ్రామంలో ప్రా రంభమయ్యా యి.

క్రీడలతో మానసికోల్లాసం
మాట్లాడుతున్న ఏసీబీ డీఎస్పీ కులశేఖర్‌

రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్‌ పోటీల ప్రారంభోత్సవంలో ఏబీసీ డీఎస్పీ కులశేఖర్‌

అనంతపురం క్లాక్‌టవర్‌, ఫిబ్రవరి 26: క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని ఏసీబీ డీఎస్పీ కులశేఖర్‌ పేర్కొన్నారు. 7వ రాష్ట్రస్థాయి సీనియర్‌ సాఫ్ట్‌బాల్‌ పోటీలు శుక్రవారం స్థానిక అనంత క్రీడాగ్రామంలో ప్రా రంభమయ్యా యి. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ కులశేఖర్‌ మాట్లాడుతూ చదువుతో పాటు, వ్యక్తి వికాసానికి క్రీడలు ఎంతగానో ఉపకరిస్తాయన్నారు. మానసిక, శారీరక ఉల్లాసం, సామూహిక శక్తి, స్నేహభావాన్ని పెంచుతాయన్నారు. ఇన్‌చార్జి డీఈఓ రవూఫ్‌, శాప్‌ పరిశీలకుడు, డీఎ్‌సఏ చీఫ్‌ కోచ్‌ జగన్నాథ్‌రెడ్డి, ఆర్డీటీ స్పోర్ట్స్‌ డైరెక్టర్‌ సాయికృష్ణ మాట్లాడుతూ క్రీడల పట్ల విద్యార్థులకు ఆసక్తి పెరుగుతోందనీ, ఇది అభినందనీయమన్నారు. కొవిడ్‌ నేపథ్యంలో నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. కార్యక్రమంలో అనంత బయోటెక్‌ డైరెక్టర్‌ రాధాకృష్ణరెడ్డి, సాఫ్ట్‌బాల్‌ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశులు, ఉపాధ్యక్షుడు నాగరాజు, కోశాధికారి నరసింహారెడ్డి, రామకృష్ణ, కార్యనిర్వాహక కార్యదర్శి కేశవమూర్తి, పీడీలు గోపాల్‌రెడ్డి, లతాదేవి, సీనియర్‌ క్రీడాకారులు కార్తీక్‌, నాగేంద్ర, అశోక్‌, మహేష్‌, ఓబులేసు, బద్రి, 13 జిల్లాల క్రీడాకారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-27T06:27:53+05:30 IST