ఆర్టీఏలో ఫైళ్ల పెండింగ్‌..!

ABN , First Publish Date - 2020-12-04T06:33:05+05:30 IST

అనంత ఆర్టీఏ కార్యాలయంలో ఫైళ్ల పెండింగ్‌ పడ్డా యి. పలు రకాల పనులు ఎక్కడివక్కడే ఉండిపోయాయి.

ఆర్టీఏలో ఫైళ్ల పెండింగ్‌..!

ట్రాన్స్‌పోర్ట్‌, నాన్‌ట్రాన్స్‌పోర్ట్‌ విభాగాలకు ఒకే ఏఓ 

మిగిలిన ఇద్దరిలో ఒకరు సస్పెన్షన్‌, మరొకరు కరోనాతో సెలవు 

ముందుకు సాగని పనులు... వాహనదారులకు

తప్పని నిరీక్షణ 

అనంతపురం వ్యవసాయం, డిసెంబరు 3 :  అనంత ఆర్టీఏ కార్యాలయంలో ఫైళ్ల పెండింగ్‌ పడ్డా యి. పలు రకాల పనులు ఎక్కడివక్కడే ఉండిపోయాయి. గత వారం రోజులుగా పెండింగ్‌ శాతం మరింత పెరిగినట్లు సమాచారం. అధికారులు, సి బ్బంది కొరతతోపాటు సంబంధిత అధికారులు పను లు వేగవంతం చేయడంలో శ్రద్ధ చూపడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ట్రాన్స్‌పోర్టులో 500, నాన్‌ ట్రాన్స్‌పోర్టులో మరో 500 ఫైళ్ల వరకు  పెం డింగ్‌లో ఉన్నట్టు సమాచారం. గత కొన్ని నెలలుగా ట్రాన్స్‌పోర్టు, నాన్‌ట్రాన్స్‌పోర్టు విభాగాలను ఒకే ఏఓ చూ సుకుంటున్నారు. ఇక్కడ విఽధులు నిర్వర్తిస్తున్న నాన్‌ట్రాన్స్‌పోర్టు ఏఓ మహబూబ్‌బాషా రెండు నెలల కిందట స స్పెండ్‌ అయ్యారు. ట్రాన్స్‌పోర్ట్‌ విభాగంలో పనిచేస్తున్న మరో ఏఓ కరోనాతో కొన్ని నెలలుగా సెలవులో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఒక ఏఓనే రెండు విభాగాల పనులు చేయాల్సిన పరిస్థితి. ఖాళీ స్థానాల్లో ఇతర అధికారులను నియమించడంపై సంబంధిత ఉన్నతాధికారులు దృష్టి సారించడం లేదన్న విమర్శలున్నాయి. మరోవైపు ఏడాదికి పైగా ఇన్‌చార్జ్‌ ఆర్టీఏ పాలన కొనసాగుతోంది. దీంతో రెండు రకాల పనులు చేయలేక సంబంధిత అధికారులు అవస్థలు పడుతున్నారు. దీని ప్రభావం వాహనదారులపై ప్రత్యక్షంగా పడుతోంది. అన్ని సవ్యంగా ఉన్నా ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకున్నా తమ ఫైళ్లు పెండింగ్‌లో ఉండటంతో వాహనదారులు ఆర్టీఏ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. సంబంధిత అధికారుల నుంచి సరైన సమాధానం రాకపోవడంతో ఏం చేయాలో తోచని అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఉన్నతాధికారులు దృష్టి సారించి పెండింగ్‌ ఫైళ్లు క్లియర్‌ చేసేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది.  


ఫైళ్ల క్లియరెన్స్‌కు చర్యలు 

అనంత ఆర్టీఓ కార్యాలయంలో పలు కారణాలతో ఏఓ పోస్టులు ఖాళీగా ఉన్న మాట వాస్తవమే. అయినప్పటికీ ఫైళ్లు పెండింగ్‌లో లేకుండా తగు చర్యలు తీసుకుంటు న్నాం. ఆ మేరకు సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆ దేశాలు జారీ చేశాం. ప్రస్తుతం ట్రాన్స్‌పోర్ట్‌, నాన్‌ట్రాన్స్‌ పోర్టు విభాగాల్లో పెండింగ్‌లోని ఫైళ్లు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటాం

- శివరాంప్రసాద్‌, డీటీసీ. 


Updated Date - 2020-12-04T06:33:05+05:30 IST