అకాల వర్షం.. నష్టం..

ABN , First Publish Date - 2021-04-21T06:31:04+05:30 IST

జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన అకాల వర్షం బీభత్సం సృష్టించింది.

అకాల వర్షం.. నష్టం..
రొద్దం సమీపంలో నేలకొరిగిన విద్యుత స్తంభం

ఈదురు గాలులతో కూడిన వాన  

పెనుకొండలో వడగండ్లు  

కూలిన విద్యుత స్తంభాలు

అనంతపురం వ్యవసాయం, ఏప్రిల్‌ 20 : జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన అకాల వర్షం బీభత్సం సృష్టించింది. జిల్లావ్యాప్తంగా 18 మండలాల్లో వర్షం పడింది. సోమవారం రాత్రి, మంగళవారం తెల్లవారుజామున, సాయంత్రం సమయాల్లో పలు ప్రాంతాల్లో చిరుజల్లుల నుంచి ఓ మో స్తరు వర్షం కురిసింది. పెనుకొండ మండలం నాగలూరు, బండపల్లి గ్రామాల్లో సోమవారం రాత్రి వడగండ్ల వర్షం పడింది. దీంతో రెండు గ్రామాల్లో 70 హెక్టార్లకు పైగా వరి పంట దెబ్బతినడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. చెన్నేకొత్తపల్లి సమీపంలోని కోనక్రాస్‌ పరిసర ప్రాంతంలో మంగళవారం సాయం త్రం గాలి, వడగండ్ల వాన బీభత్సం సృష్టించిం ది. ఒక్కసారిగా భారీ గాలులతో కూడిన వడగండ్లవాన పడటంతో పరిసర ప్రాంతాల్లోని రేకులషెడ్లు గాలికి ఎగిరిపోయాయి. విద్యుత స్తంభాలు నేలకొరగడంతో వైర్లు తెగిపడ్డాయి. చెన్నేకొత్తపల్లికి చెందిన కురుబ వీరప్ప వ్యవసాయ తోటలో నూతనంగా నిర్మించిన రేకులషెడ్‌ పూర్తిగా ధ్వంసమైంది. అందులోని వస్తువులు, రేకులు గాలివాన దెబ్బకు దాదాపు 200 మీటర్ల దాకా ఎగసిపడ్డాయి. తద్వారా రూ.2 లక్షల ఆస్తినష్టం వాటిల్లిందని బాధిత రైతు ఆవేదన వ్యక్తంచేశారు. రొద్దం మండలం చెరుకూరు, కే మరువపల్లి, పెద్దమంతూరు తదితర గ్రామాల్లో మంగళవారం తెల్లవారుజామున కురిసిన గాలి వాన బీభత్సం సృష్టించింది. దీంతో మామిడి తోటల్లోని కాయలు రాలిపోయాయి. అలాగే పలు విద్యుత స్తంభా లు నేలకొరిగాయి. 33 కేవీ విద్యుత స్తంభాలు రెండు పడిపోవడంతో పెద్దమంతూరు సబ్‌స్టేషనలో విద్యుత అంతరాయం ఏర్పడింది.  సాయంత్రం చిలమత్తూరు, పుట్లూరు, మండలాల్లో ఈదురుగాలతో కూడిన వర్షం పడింది. పెద్దవడుగూరు, గుత్తి మండలాల్లో ఈదురుగాలులతోపాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దీంతో ఆయా మండలాల్లోని పలు గ్రామాలకు విద్యుత అంతరా యం ఏర్పడటంతో ప్రజలు చిమ్మచీకట్లో గడపాల్సి వచ్చింది. పెనుకొండలో ఓ మోస్తరు వర్షం పడింది. అలాగే అనంతపురం, గుంతకల్లుతో పాటు ఇతర ప్రాంతాల్లో  రాత్రి ఆకాశం మేఘావృతం కావడంతో పాటు ఈదురు గాలులు వీచాయి. దీంతో స్థానిక ప్రజలు వేస వి తాపం నుంచి కాస్త ఉపశమనం పొందా రు. జిల్లాలో అత్యధికంగా రొళ్లలో 24.2  మి.మీ. వర్షపాతం నమోదైంది. అలాగే మడకశిరలో 24.0, హిందూపురంలో 23.8, గోరంట్లలో 12.2  మి.మీ వర్షపాతం నమోదైంది. మిగిలిన మండలాల్లో 9.4 మి.మీ.లోపు వర్షపాతం నమోదైంది. ఈనెల సాధారణ వర్షపాతం 12.8 మి.మీ. కాగా ఇప్పటిదాకా 14.5 మి.మీ వర్షపాతం నమోదైంది. 





Updated Date - 2021-04-21T06:31:04+05:30 IST