వైసీపీ రెడ్ల పార్టీ అయితే.. బీసీల ఓట్లెందుకు?

ABN , First Publish Date - 2020-10-01T09:39:17+05:30 IST

అధికార వైసీపీ రెడ్ల పార్టీ అయితే మరి బీసీలను ఎందుకు ఓట్లు అభ్యర్థించారని బహుజన ప్రజావేదిక నాయకులు విరుచుకుపడ్డారు. బీసీలను కించపరిచేలా మాట్లాడిన రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి వాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని రాష్ట్ర అధ్యక్షుడు అంపావతిని గోవిందు పేర్కొన్నారు.

వైసీపీ రెడ్ల పార్టీ అయితే.. బీసీల ఓట్లెందుకు?

ఎమ్మెల్యే ప్రకా్‌షరెడ్డి వ్యాఖ్యలు అభ్యంతరకరం 

ఆంధ్ర బహుజన ప్రజావేదిక అధ్యక్షుడు

అనంతపురం సెంట్రల్‌, సెప్టెంబరు 30: అధికార వైసీపీ రెడ్ల పార్టీ అయితే మరి బీసీలను ఎందుకు ఓట్లు అభ్యర్థించారని బహుజన ప్రజావేదిక నాయకులు విరుచుకుపడ్డారు. బీసీలను కించపరిచేలా మాట్లాడిన రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి వాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని రాష్ట్ర అధ్యక్షుడు అంపావతిని గోవిందు పేర్కొన్నారు. బుధవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో బ హుజన ప్రజావేదిక నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు.


ఆ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు అంపావతిని గోవిందు మాట్లాడుతూ ఎమ్మెల్యే వైసీపీ రెడ్ల పార్టీ అన్నప్పుడు ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీలను ఓట్లు అడగడం దేనికని ప్రశ్నించారు. వెంగళమ్మచెరువుకు చెందిన జగన్‌మోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రకా్‌షరెడ్డితో మంత్రి శంకర్‌నారాయణ సోదరుడు మల్లికార్జునపై ఫోన్‌లో మాట్లాడిన తీరు సభ్యసమాజం తలదించుకునేలా ఉందన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి అనే వ్యక్తి బీసీలను తిడుతున్నప్పుడు ఎమ్మెల్యే స్థాయిలో ఉండి నిలువరించాల్సిందిపోయి వంత పాడటం బాధాకరమన్నారు. వెంటనే ఎమ్మెల్యే ప్రకా్‌షరెడ్డి, జగన్‌మోహన్‌రెడ్డిలు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.


కార్యక్రమంలో నాయకులు పార్వతమ్మ, ప్రసాద్‌, హరిప్రసాద్‌, రంగనాయకులు, సామ్రాట్‌ మధు, కుళ్లాయప్ప, డాక్టర్‌ కుళ్లాయప్ప, నాగభూషణం, ఓబులేసు, రామకృష్ణ, ఎర్రిస్వామి, శివయ్య, లక్ష్మ న్న, డేరంగుల భాస్కర్‌, నారాయణ, శర్మాస్‌ వలి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-01T09:39:17+05:30 IST