అర్హత ఉన్నా అందని చేయూత ధర్మవరంరూరల్‌,

ABN , First Publish Date - 2020-09-24T08:58:13+05:30 IST

అర్హత ఉన్నా వైఎస్‌ఆర్‌ చేయూత పథకం అందలేదని మండలంలోని చిగిచెర్ల గ్రామానికి చెందిన ఎస్సీకాలనీకి చెందిన సాకే నరసింహులు భార్య సాకే లక్ష్మమ్మ ఆవేదన వ్యక్తం చేసింది.

అర్హత ఉన్నా అందని చేయూత ధర్మవరంరూరల్‌,

సెప్టెంబరు 23: అర్హత ఉన్నా వైఎస్‌ఆర్‌ చేయూత పథకం అందలేదని మండలంలోని చిగిచెర్ల గ్రామానికి చెందిన ఎస్సీకాలనీకి చెందిన సాకే నరసింహులు భార్య సాకే లక్ష్మమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. మంగళవారం ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్సాఆర్‌ చేయూత పథకానికి దరఖా స్తు చేసుకున్నప్పటీకీ వయస్సు లేదంటూ దరఖాస్తును తిరస్కరించారన్నారు. తన ఆధార్‌, రేషన్‌కార్డుల ప్రకారం 53 ఏళ్లు వయసు ఉందంటూ పేర్కొంది.


మొదటి విడతలో దరఖాస్తు చేసుకున్నా.. రాకపోయే సరికి అధికారులను కలవగా ఆన్‌లైన్‌లో మాత్రం 45 సంవత్సరాలకు 5 రోజులు తేడా ఉందంటూ తెలిపారన్నారు. రెండో విడతలో తప్పకుండా పథకం వర్తిస్తుందన్నారు. ప్రస్తుతం రెండో విడతలోనూ దరఖాస్తు చేసుకుంటే మొదటివిడతలో దరఖాస్తు చేసుకున్నట్లు ఆన్‌లైన్‌లో చూపుతోందన్నారు.


ఇదే విషయాన్ని మండల అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. పట్టించుకోలేదని బాధితురాలు వాపోయింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పథకం వర్తించేలా న్యాయం చేయాలని లక్ష్మమ్మ వేడు కుంటోంది.

Updated Date - 2020-09-24T08:58:13+05:30 IST