మరో కుంభకోణం.. అడ్డంగా దొరికిన అధికారులు

ABN , First Publish Date - 2021-01-23T06:50:10+05:30 IST

జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖలో మరో మాయాజాలం జరిగినట్లు తె లుస్తోంది. సామగ్రి కొనుగోలు చేయకపోయినా చేసినట్టు, సరఫరా కాకపోయినా అయినట్టు రికార్డుల్లో చూపించారు.

మరో కుంభకోణం.. అడ్డంగా దొరికిన అధికారులు

సామగ్రి సరఫరా చేయకపోయినా చేసినట్టు సంతకాలు

ఐసీడీఎస్‌లో మరో కుంభకోణం !

అడ్డంగా దొరికిన అధికారులు, సీడీపీఓలు

కలెక్టర్‌కు చేరిన అవినీతి కథ... వేటుకు సిద్ధం 


అనంతపురం వైద్యం, జనవరి 22 : జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖలో మరో మాయాజాలం జరిగినట్లు తె లుస్తోంది. సామగ్రి కొనుగోలు చేయకపోయినా చేసినట్టు, సరఫరా కాకపోయినా అయినట్టు రికార్డుల్లో చూపించారు. కాంట్రాక్టర్‌తో కుమ్మకై దొంగ బిల్లులు పెట్టుకొని దాదాపు రూ.16 లక్షలు దోపిడీ చేసినట్టు సమాచారం. ఈ అవినీతి వ్యవహారం వెలుగులోకి రావడంతో పీడీ విజయలక్ష్మి దీని పై ప్రత్యేక దృష్టి సారించి గుట్టుగా విచారణ చేశారు. అం దులో కుంభకోణం వాస్తవమని తేలినట్టు తెలిసింది. ఈ అక్రమం వ్యవహారం కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేసి చర్యలకు ఉపక్రమించినట్టు చర్చించుకుంటున్నారు. 


అసలు ఏం జరిగిందంటే ....

అంగన్‌వాడీ కేంద్రాలకు ప్లేట్‌లు, గ్లాసులు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. గత జాయింట్‌ కలెక్టర్‌ ఢిల్లీరావు ఉన్నప్పుడు వీటిని సరఫరా చేయడానికి ప్రొసీడింగ్‌పై ఆయన సంతకం పెట్టించుకొని ఆమోదం తీసుకున్నారు. అయితే ఏం జరిగిందో అప్పట్లో ఆ ఫైల్‌ పక్కకు పెట్టేశారు. ఆ తర్వాత ప్రస్తుత జేసీ డాక్టర్‌ సిరితో మరోసారి అదే ప్రొసీడింగ్‌ పేరుతో మరో ఫైల్‌ తయారు చేసి ఆమోదం తీసుకున్నారు. ఇదంతా బా గుంది. కాంట్రాక్టర్‌ ప్రొసీడింగ్‌ మేరకు అంగన్‌వాడీ కేంద్రాలకు ప్లేట్‌లు, గ్లాసులు పంపిణీ చేయాలి. కానీ ఇక్కడ వా టిని సరఫరా చేయకుండానే సరఫరా చేసినట్టు ఐసీడీఎస్‌ శాఖలోని సంబంధిత అకౌంట్స్‌ విభాగం అధికారులు ఫైల్‌ రాసి పీడీతో ఆమోదం వేయించుకొని జేసీకి పంపించి ఆ ఫైల్‌పై సంతకం పెట్టించుకున్నట్టు  సమాచారం.  జిల్లా లోని 17 ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల సీడీపీఓలతోను సరఫరా చేసినట్లు కాంట్రాక్టర్‌ సంతకాలు చేయించుకున్నట్లు తెలు స్తోంది. ఈ అక్రమ బాగోతం వెలుగులోకి రావడం విచా రణలో వాస్తవమని తేలడం చర్యలకు ఫైల్‌ను శుక్రవారం కలెక్టర్‌కు పంపడం ఆ శాఖలో తీవ్ర దుమారం రేపుతోంది ఐసీడీఎస్‌ కార్యాలయంలో పనిచేసే ఓ సీనియర్‌ అసి స్టెంట్‌పై వేటు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకో వైపు ప్లేట్‌లు, గ్లాసులు సరఫరా చేయకపోయినా సరఫరా చేసినట్లు సంతకాలు చేసిన 17 మంది సీడీపీఓలకు చార్జ్‌ మెమోలు జారీ చేసే అవకాశాలు ఉన్నట్టు ఆ శాఖ వర్గాల సమాచారం. సంబంధిత కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకుం టారా? లేదా అనేదానిపైన చర్చ సాగుతోంది. ఈ విష యంపై పీడీ కూడా చాలా గుట్టుగా వ్యవహరిస్తున్నట్లు కనపడుతోంది. ఆమె దృష్టికి తీసుకెళితే ఒకరోజు ఆగండి అంతా తెలుస్తుందని చెప్పడం చూస్తే అక్రమం వాస్తవ మని తెలుస్తోంది. మొత్తం మీద ఇప్పటికే అంగన్‌వాడీల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై ఐదుగురు సీడీపీఓ లకు షోకాజ్‌లు ఇచ్చారు. జిల్లాలోని అన్ని ప్రాజెక్టులలో ప్రత్యేక అధికారిగా నియమితులైన జిల్లా అటవీ శాఖాధి కారి నిషాంత్‌రెడ్డి విచారణ కొనసాగిస్తున్నారు. కొందరు సీడీపీఓలు మెడికల్‌ లీవ్‌లో వెళ్లేందుకు ప్రయత్నిస్తు న్నారు. ఈ పరిస్థితిలో మరో కుంభకోణం బయటపడడం ఆ శాఖలో మరింత ఆందోళన కలిగిస్తోంది. 

Updated Date - 2021-01-23T06:50:10+05:30 IST