అనారోగ్యంతో మాజీ ఎమ్మెల్యే రంగనాయకులు మృతి

ABN , First Publish Date - 2021-07-03T06:07:23+05:30 IST

హిందూపురం మాజీ ఎమ్మె ల్యే పామిశెట్టి రంగనాయకులు (72) శుక్రవారం అనారోగ్యంతో మృతిచెందారు.

అనారోగ్యంతో మాజీ ఎమ్మెల్యే రంగనాయకులు మృతి

హిందూపురం, జూలై 2: హిందూపురం మాజీ ఎమ్మె ల్యే పామిశెట్టి రంగనాయకులు (72) శుక్రవారం అనారోగ్యంతో మృతిచెందారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శు క్రవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. కుటుంబ సభ్యులు ముద్దిరెడ్డిపల్లిలోని సృగృహం నుంచి హిందూపు రం ప్రభుత్వాస్పత్రికి తరలించేలోపే ఆయన మరణించారు. చేనేత సామా జిక వర్గానికి చెందిన రంగనాయకులు టీడీపీ ఆవిర్భావ సమయంలో క్రియాశీలక కార్యకర్తగా పార్టీలో చేరారు. 1983లో హిందూపురం నుంచి మొట్టమొదటి టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004లో మరోసారి టీడీపీ నుంచి గెలుపొందారు. రెండుసార్లు హిందూపురం నుంచే టీడీపీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాష్ట్ర ఆప్కో, బీసీ కార్పొరేషన్‌ చైర్మన్‌గా పనిచేశారు. ఇటీవల మున్సిపల్‌ ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. అజాతశత్రువుగా, వివాదరహితుడు గా ప్రజల మన్ననలు పొందారు. ఎమ్మెల్యేగా ని యోజకవర్గంలో వి ద్య, వైద్యం, పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేశారు. రంగనాయకులుకు భార్య, ముగ్గురు కుమారులు న్నారు. విషయం తెలియ గానే టీడీపీ నాయకులు, కార్యకర్తలు.. ముద్దిరెడ్డిపల్లిలోని ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి, నివాళులు అర్పించారు. పలువురు వైసీపీ, కాంగ్రెస్‌, చే నేత సంఘాల నాయకులు.. రంగనాయకులు కుటుంబ సభ్యులను ఓదార్చారు.

Updated Date - 2021-07-03T06:07:23+05:30 IST