మున్సిపల్‌ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి

ABN , First Publish Date - 2021-02-27T06:36:44+05:30 IST

మున్సిపల్‌ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అదికారి, కలెక్టర్‌ గంధం చంద్రుడు.. సంబంధిత అధికారులను ఆదేశించారు.

మున్సిపల్‌ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి
అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ గంధం చంద్రుడు

అధికారులకు కలెక్టర్‌ ఆదేశం

అనంతపురం, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): మున్సిపల్‌ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అదికారి, కలెక్టర్‌ గంధం చంద్రుడు.. సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈమేరకు శుక్రవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో ఆయన మున్సిపల్‌ ఎన్నికలపై అధికారులతో సమీక్షించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ నిబంధనల మేరకు మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించాలన్నారు. ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటేసేలా తగిన ఏ ర్పాట్లు చేయాలన్నారు. ఎన్నికల కోడ్‌ అమలుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. 8వ తేదీలోపు ఓటర్లకు స్లిప్పుల పంపిణీ పూర్తి చేయాలన్నారు. ఎన్నికల కోసం స్టాటిక్‌, వీడియో సర్వేలెన్స్‌ బృందాలు ఏర్పాటు చేయాలన్నారు. వెబ్‌ కాస్టింగ్‌, ఈఓ, ఏఈఓలు, ఎన్నికల సిబ్బందికి శిక్షణా తరగతుల నిర్వహణ, తదితర అంశాలపై సమీక్షలు నిర్వహించి, అందుకు సంబంధించిన నివేదికలను తనకు ఎప్పటికప్పుడు అందజేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎన్నికల్లో ఉత్పన్నమయ్యే సమస్యల ను ముందుగా అంచనా వేసి, అందుకు తగిన విధంగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. అత్యధికంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. మున్సిపాల్టీల పరిధిలోని పాఠశాలల్లో విద్యార్థులకు ఓటు ప్రాధాన్యం తెలియజేసి, వారి తల్లిదండ్రులు ఓటింగ్‌లో పాల్గొనేలా అవగాహన కల్పించాలన్నారు. ఎన్నికల్లో మద్యం, డబ్బు రవాణా కాకుండా పకడ్బందీగా భద్రతను ఏర్పాటు చేయాలన్నారు. ఎస్పీ సత్యయేసుబాబు మాట్లాడుతూ మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో పటిష్ట బందోబస్తు చర్యలు తీసుకుంటున్నామన్నా రు. మద్యం, డబ్బును అరికట్టేందుకు తగిన చర్యలు చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్లు నిశాంత్‌కుమార్‌, డాక్టర్‌ సిరి, గంగాధర్‌ గౌడ్‌, మున్సిపల్‌ ఆర్డీ నాగరాజు, కమిషనర్‌ మూర్తి, డిప్యూటీ కలెక్టర్‌ నిశాంత్‌, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ కుమరీశ్వరన్‌ పాల్గొన్నారు.


రుణాల మంజూరులో అలసత్వం వీడండి

స్టాండప్‌ ఇండియా తదితర ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిదారులకు రుణాల మంజూరులో అలసత్వం వీడాలని జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు.. బ్యాంకర్లను ఆదేశించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం కలెక్టరేట్‌ నుంచి సంబంధిత అధికారులతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. స్టాండప్‌ ఇండియా, ఇతర ప్రభుత్వ పథకాల కింద ఆరు నెలలుగా మానిటరింగ్‌ చేస్తున్న లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేయడంలో అలసత్వం వహించటంపై కలెక్టర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. పేద లబ్ధిదారులకు రుణాలు మం జూరు చేయకుండా తాత్సార్యం చేస్తున్నారన్నారు. వెంటనే ప్రభు త్వం నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని బ్యాంకర్లకు సూచించారు. కాన్ఫరెన్స్‌లో జేసీ డాక్టర్‌ సిరి, ఎల్‌డీఎం మోహన్‌ మురళి, పరిశ్రమల శాఖ జీఎం సుదర్శన్‌బాబు, వివిధ శాఖల అధికారులు, బ్యాంకర్లు పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-27T06:36:44+05:30 IST