Abn logo
Feb 27 2021 @ 01:11AM

కొత్తగా ఆరు కరోనా కేసులు

అనంతపురం వైద్యం, ఫిబ్రవరి26: జిల్లాలో శుక్రవారం ఆరు కరోనా కేసులు నమోదయ్యాయి. మూడు రోజులుగా కేసులు పెరుగుతున్నాయి. చికిత్స పొందే బాధితుల సంఖ్య కూడా పెరిగింది. మూడు రోజుల క్రితం 26 మంది చికిత్స పొందుతుండేవారు. ప్రస్తుతం ఆ సంఖ్య 42కి చేరిందని అధికారులు తెలిపారు. ఇ ప్పటివరకు జిల్లాలో 67746 మంది కరోనా బారినపడ్డారు. ఇం దులో 67105 మంది ఆరోగ్యంగా కోలుకున్నారు. 599 మంది మరణించారు. గడిచిన 24 గంటల్లో వైరస్‌తో ఎవరూ చనిపోలేదు.

Advertisement
Advertisement
Advertisement