ఆత్మస్థైర్యంతో పనిచేయాలి

ABN , First Publish Date - 2022-05-18T06:23:41+05:30 IST

ఆత్మస్థైర్యంతో పనిచేయాలి

ఆత్మస్థైర్యంతో పనిచేయాలి
కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎస్పీ కౌశల్‌

 స్ర్టెస్‌ మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రాంలో ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌

పెనమలూరు, మే 17 : విధుల్లో పోలీసు సిబ్బంది వత్తిడికి గురవకుండా ఆత్మస్థైర్యంతో పని చేయాలని ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌ అన్నారు. మంగళ వారం కానూరులోని మన కల్యాణ మండపంలో పెనమలూరు పోలీ్‌సస్టేషన్‌  సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు స్ర్టెస్‌ మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌ విచ్చేశారు. ఆర్ట్స్‌ఆఫ్‌ లివింగ్‌కు చెందిన మోటివేషనల్‌ స్పీకర్స్‌, మానసిక వైద్య నిపుణులు పోలీసు సిబ్బందికి, వారి కుటుంబ సభ్యు లకు ఒత్తిడిని అధిగమించేందుకు మెళకువలను వివరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన సేవలందించే ఉద్దేశంతో స్ర్టెస్‌ మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సిబ్బంది ఆత్మవిశ్వాసం, మానసికస్థైర్యాన్ని పెంపొం దించుకోవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న సిబ్బందిలో కొంతమందిని గుర్తించి వారికి ప్రత్యేకంగా వ్యక్తిగత కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామన్నారు. పబ్లిక్‌ సర్వీసులో సిబ్బందితో పాటు వారి  కుటుంబ సభ్యులు కూడా వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేయా ల్సి వస్తుందన్నారు. సమయానికి మంచి ఆహారం తీసుకోవడంతో పాటు ప్రతి రోజు కనీసం 40 నిమి షాలపాటు యోగా, వ్యాయామం చేయాలన్నారు. అనంతరం సిబ్బంది కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో గన్నవరం డీఎస్పీ కె. విజయ్‌ పాల్‌, సీఐ సత్యనారాయణ, మోటివేషన్‌ స్పీకర్స్‌ నాగిరెడ్డి, సురేష్‌, మానసిక వైద్యనిపుణులు శంకరరావు, టి.ఎ్‌స.రావు చైల్డ్‌వెల్ఫేర్‌ కమిటీ డైరెక్టర్‌ వై. భార్గవరామ్‌, పోలీసు సిబ్బందితో పాటు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

 సీఐ సత్యనారాయణకు అవార్డు 

దిశ యాప్‌ను పెనమలూరు పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో అత్యధిక మందిచేత డౌన్‌లోడ్‌ చేయించినందుకు గాను పెనమలూరు సీఐ సత్యనారాయణకు జిల్లా ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌ అవార్డును అందజేసి అభినం దించారు. మంగళవారం మచిలీపట్నంలోని ఎస్పీ కార్యాలయంలో ఈ అవార్డును ప్రదానం చేశారు. స్టేషన్‌ పరిధిలో అత్యధికంగా 7,958 మందిచేత స్మార్ట్‌ఫోన్‌లో యాప్‌ డౌన్‌లోడ్‌ చేయించినందుకు గాను ఈ అవార్డు దక్కింది.  

Updated Date - 2022-05-18T06:23:41+05:30 IST