విమాన ప్రమాదాన్ని ఏటీసీ వెంటనే గుర్తించలేదు...

ABN , First Publish Date - 2020-08-08T15:35:36+05:30 IST

దుబాయ్ నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం కోజికోడ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రమాదానికి గురైనా, వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలరు గుర్తించలేదని ప్రాథమిక దర్యాప్తులో....

విమాన ప్రమాదాన్ని ఏటీసీ వెంటనే గుర్తించలేదు...

విమాన ప్రమాదాన్ని ముందు గుర్తించింది ఎవరంటే...

కోజికోడ్ (కేరళ): దుబాయ్ నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం కోజికోడ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రమాదానికి గురైనా, వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలరు గుర్తించలేదని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. విమానం రన్ వేపైకి దూసుకువెళ్లి టేబుల్ టాప్ నుంచి పడి పోయి రెండు భాగాలుగా విడిపోయిన ప్రమాద ఘటనను మొట్టమొదటిగా ఆ ప్రాంతంలోని పెట్రోలింగ్ పార్టీ ఇన్‌చార్జి అజిత్ గమనించారు. అజిత్ వెంటనే విమాన ప్రమాదం గురించి విమానాశ్రయం యూనిట్ కంట్రోల్ రూం, యూనిట్ లైన్ కు సమాచారం ఇచ్చారని విమానాశ్రయ అధికారుల ద్వారా తెలిసింది. విమాన ప్రమాద సందేశం వచ్చిన 10 నిమిషాల్లోనే పక్కనే బ్యారక్‌లో నివశిస్తున్న 40 మంది సీఐఎస్ఎఫ్ సిబ్బంది, కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్, క్విక్ రెస్పాన్స్ టీం సభ్యులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రయాణికులను తరలించారు. సీఐఎస్ఎఫ్ సిబ్బంది ప్రయాణికులను సమీప ఆసుపత్రులకు తరలించారు. విమాన ప్రమాదం గురించి రాష్ట్ర అధికారులకు సమాచారం అందించడంతో 25 నిమిషాల తర్వాత స్థానిక పోలీసులు, విమానాశ్రయ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ దుర్ఘటన స్థలానికి వచ్చి సహాయ చర్యలు చేపట్టారు. 

Updated Date - 2020-08-08T15:35:36+05:30 IST