Texas ట్రక్కులో 46 మంది వలసదారుల మృతి

ABN , First Publish Date - 2022-06-28T13:48:50+05:30 IST

అమెరికా దేశంలోని టెక్కాస్ నగరంలో ఓ ట్రక్కులో 46 మంది వలసదారులు మరణించిన ఘటన

Texas ట్రక్కులో 46 మంది వలసదారుల మృతి

టెక్సాస్ (అమెరికా): అమెరికా దేశంలోని టెక్కాస్ నగరంలో ఓ ట్రక్కులో 46 మంది వలసదారులు మరణించిన ఘటన సంచలనం రేపింది.టెక్సాస్‌లోని శాన్ ఆంటోనియోలో ట్రాక్టర్-ట్రైలర్‌లో 46 మంది వలసదారులు చనిపోయారని టెక్సాస్ నగర అగ్నిమాపక విభాగం తెలిపింది.యూఎస్-మెక్సికో సరిహద్దులో మానవ అక్రమ రవాణాలో అత్యంత ఘోరమైన సంఘటనలలో ఒకటని నగర అగ్నిమాపక విభాగం తెలిపింది.శాన్ ఆంటోనియో ఫైర్ డిపార్ట్‌మెంట్ ట్రైలర్‌లో కనిపించిన మరో 16 మందిని హీట్ స్ట్రోక్ తో అనారోగ్యానికి గురవడంతో వారిని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. వీరిలో నలుగురు మైనర్‌లు ఉన్నారు. ఈ ఘటన తర్వాత ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.




టెక్సాస్ నగర దక్షిణ శివార్లలోని మారుమూల ప్రాంతంలో రైలు పట్టాల పక్కన ఈ ట్రక్కును కనుగొన్నారు.మృతదేహాలు ఉన్న ట్రక్కు చుట్టూ పోలీసు వాహనాలు, అంబులెన్సులు కనిపించాయి. శాన్ ఆంటోనియో పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి కేసును దర్యాప్తు చేస్తున్నారు.మరణించిన వారంతా అక్రమ వలసదారులని భావిస్తున్నారు. శాన్ ఆంటోనియో పోలీసు అధికారులు ట్రక్కు డ్రైవర్ కోసం వెతుకుతున్నారు. డ్రైవరు ట్రక్కును గుర్తించక ముందే దానిని విడిచిపెట్టినట్లు తెలుస్తోంది.ట్రక్కులో ఉన్న వలసదారులు ఊపిరాడక పోవడంతో మరణించారని ట్విట్టర్‌లో టెక్సాస్‌లో విషాదం అని మెక్సికో విదేశాంగ మంత్రి మార్సెలో ఎబ్రార్డ్ తెలిపారు. ఇటీవల యూఎస్-మెక్సికో సరిహద్దు వద్ద రికార్డు సంఖ్యలో వలసదారులు దాటారు. 


Updated Date - 2022-06-28T13:48:50+05:30 IST