వీఆర్‌ఏలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి

ABN , First Publish Date - 2022-08-20T05:14:53+05:30 IST

వీఆర్‌ఏలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యుడు కూరపాటి రమేష్‌ డిమాండ్‌ చేశారు.

వీఆర్‌ఏలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి
మాట్లాడుతున్న సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యుడు కూరపాటి రమేష్‌

సిరిసిల్ల రూరల్‌, ఆగస్టు 19: వీఆర్‌ఏలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యుడు కూరపాటి రమేష్‌ డిమాండ్‌ చేశారు. సిరిసిల్ల పట్టణంలోని తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట  వీఆర్‌ఏలు 26 రోజులుగా చేస్తున్న సమ్మె శిబిరాన్ని శుక్రవారం సీఐటీయూ నాయకులు సందర్శించి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యుడు రమేష్‌ మట్లాడుతూ హామీలను అమలు చేయాలని వీఆర్‌ఏలు సమ్మె చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు స్పందించకపోవడం చాలా దుర్మార్గమైన విషయమాన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో హక్కుల కోసం కాకుండా ఇచ్చిన హామీలను అమలు చేయాలని పోరాటం చేయాల్సి రావడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో ప్రభుత్వానికి, అధికారులకు, ప్రజలకు వారధిగా పని చేస్తున్న వీఆర్‌ఏల సమస్యలను పరిష్కరించడంలో ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇప్పటికైన ప్రభుత్వం స్పందించాలని, వీఆర్‌ఏల డిమాండ్లను నెరవేర్చాలని, లేని పక్షంలో  రాబోయే ఎన్నికలలో రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.  కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కోడం రమణ, జిల్లా నాయకులు మోర అజయ్‌, గుర్రం అశోక్‌, సూరం పద్మ, జివ్వాజి విమల, గడ్డం ఎల్లయ్య, సామనపెల్లి రాములు తదితరులు పాల్గొన్నారు. 

 ఫవీఆర్‌ఏలు అర్థ ఆకలితో అలమటిస్తున్నారని వీఆర్‌ఏల సంఘం డివిజన్‌ అధ్య క్షుడు రాధాశంకర్‌ అన్నారు. సిరిసిల్ల పట్టణం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట వీఆ ర్‌ఏల జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహార దీక్షలు శుక్రవారానికి 26వ రోజుకు చేరు కున్నాయి.  సీఎం కేసీఆర్‌ వీఆర్‌ఏలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.  శిబిరంలో వీఆర్‌ఏల జేఏసీ నాయకులు, వీఆర్‌ఏలు పాల్గొన్నారు.

వేములవాడ టౌన్‌   వీఆర్‌ఏలు పట్టణంలో ర్యాలీ నిర్వహిచి తెలంగాణ తల్లి విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు.   26 రోజులుగా   సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2022-08-20T05:14:53+05:30 IST