Abn logo
Mar 29 2020 @ 06:03AM

బీహర్‌ కార్మికులకు సాయం

రాజాం, మార్చి 28:  లాక్‌డౌన్‌ కారణంగా ఒకపక్క  పనులు లేక.. మరోప క్క చేతిలో నగదు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న బీహర్‌ కార్మికులను  సారథి గ్రామానికి చెందిన అడపా రామారావు ఆదుకున్నారు. బీహర్‌కు చెందిన 20 మంది కార్మికులు  స్థానిక వస్త్రపురికాలనీలో నివాసముంటున్నా రు.  గత కొన్ని నెలలుగా వీరంతా రాజాంలోనే ప్లోరింగ్‌ పనులు చేస్తున్నారు.


అయితే, లాక్‌డౌన్‌ కారణంగా పనులు లేకపోవడంతో ఆకలితో అలమటిస్తున్నారు. ఈ విషయం స్థానిక వీఆర్వో గెడ్డాపు శ్రీనివాసరావుకు తెలిసింది. దీంతో ఆయన రామారావును సంప్రదించారు. ఈ మేరకు రామారావు శనివారం బీహర్‌ కార్మికులకు 25 కేజీల బియ్యం, ఉల్లిపాయలు, బంగాళదుంపలు, తదితర నిత్యవసర సరుకులను అందజేశారు. అలాగే కొంత ఆర్థిక సాయం చేశారు.  

Advertisement
Advertisement
Advertisement