‘గాలికుంటు’ నివారణకు సహకరించాలి

ABN , First Publish Date - 2021-10-20T04:45:16+05:30 IST

‘గాలికుంటు’ నివారణకు సహకరించాలి

‘గాలికుంటు’ నివారణకు సహకరించాలి
యంనంపేట్‌లో వివరాలు తెలుసుకుంటున్న శేఖర్‌

  • జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి శేఖర్‌

ఘట్‌కేసర్‌/మేడ్చల్‌ : గాలికుంటు వ్యాధి నివారణకు రైతులు సహకరించాలని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి శేఖర్‌ అన్నారు. మంగళవారం పోచారం మున్సిపాలిటీ యంనంపేట్‌లో గాలికుంటు వ్యాధి నివారణకు టీకాలు వేసే కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. గాలికుంటు వ్యాధి పశువులను పీల్చి పిప్పి చేస్తుందని, పాడి పశువుకు వ్యాధి సోకితే పాల దిగుబడి గణనీయంగా తగ్గిపోతుందన్నారు. ఎడ్లు, దున్నలు శక్తిని కోల్పోయి వ్యవసాయ పనుల్లో ఇబ్బంది పెడతాయన్నారు. అనంతరం టీకాలు వేసేందుకు చేపట్టిన ఏర్పాట్ల గురించి మండల పశువైద్యాధికారి పద్మినిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా మేడ్చల్‌ మండలం గౌడవెల్లి గ్రామంలో గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని ఎంపీపీ పద్మజగన్‌రెడ్డిప్రారంభించారు.ప్రభుత్వం ఉచితంగా టీకాలు పంపిణీ చేస్తుందని, రైతులందరూ తప్పనిసరిగా పశువులకు టీకాలు వేయించాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్‌ సురేందర్‌ముదిరాజ్‌, పశువైద్యాధికారి విశాల్‌, ఉపసర్పంచ్‌ పెంటమ్మ, కార్యదర్శి విజయ్‌కుమార్‌, కాంగ్రెస్‌ పార్టీ మండలాధ్యక్షుడు రమణారెడ్డి, రాజుగౌడ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-20T04:45:16+05:30 IST