Advertisement
Advertisement
Abn logo
Advertisement
Sep 1 2021 @ 13:05PM

Assam:కరోనా కలకలం..నేటినుంచి మళ్లీ నైట్ కర్ఫ్యూ

గౌహతి (అసోం): అసోం రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటం కలవరం రేపుతోంది. అసోంలో తాజాగా 570 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. కరోనాతో తాజాగా ఐదుగురు మరణించారు. దీంతో బుధవారం నుంచి మళ్లీ నైట్ కర్ఫ్యూ విధించాలని నిర్నయించారు. కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు రాత్రి 9 నుంచి తెల్లవారుజామున 5గంటల వరకు రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్లు అసోం రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. గత ఏడు రోజుల్లో 10 కరోనా కేసుల కంటే ఎక్కువగా నమోదైన ప్రాంతాలు, కంటైన్మెంట్ జోన్లలో రాత్రి కర్ఫ్యూను అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు.అసోం రాష్ట్రంలో కరోనా మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,89,426కు పెరిగడంతో తాము రాత్రిపూట కర్ఫ్యూ విధించామని అసోం రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కేశబ్ మహంత చెప్పారు.

 కొవిడ్ తో మరణాల సంఖ్య 5,660కి పెరిగింది. కాంరూప్ మెట్రోలో 131 కరోనా కేసులు వెలుగుచూశాయి. జోర్హాట్, గోలఘాట్ జిల్లాల్లో 37 కేసుల చొప్పున, శివసాగర్ జిల్లాలో 30 కరోనా కేసులు నమోదైనాయి.మంగళవారం ఒక్కరోజు 88,519 మందికి పరీక్షలు చేయగా, వారిలో 570 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. కరోనా పాజిటివిటీ రేటు 0.64 శాతంగా నిలిచింది. ప్రస్థుతం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 5,554కు పెరిగింది. కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు,  రెస్టారెంట్లు, హోటళ్లు, దాబాలు, షోరూంలు, దుకాణాలు రాత్రి 8 గంటల వరకు మూసివేయాలని సర్కారు ఆదేశించింది. ప్రయాణికులు వ్యాక్సిన్ వేయించుకోవడంతోపాటు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సర్కారు సూచించింది. 


Advertisement
Advertisement