Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Fri, 23 Sep 2022 11:25:06 IST

Congress presidential poll: కాంగ్రెస్ అధ్యక్ష పదవిపై రాహుల్ గాంధీ ఆదేశం

twitter-iconwatsapp-iconfb-icon
Congress presidential poll: కాంగ్రెస్ అధ్యక్ష పదవిపై రాహుల్ గాంధీ ఆదేశం

తిరువనంతపురం : కాంగ్రెస్ అధ్యక్ష పదవిపై రాహుల్ గాంధీ తన మనోగతాన్ని మరోసారి స్పష్టం చేశారని ఆ పార్టీ సీనియర్ నేత, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ చెప్పారు. గాంధీ కుటుంబ సభ్యులెవరూ ఈ పదవిని చేపట్టకూడదని రాహుల్ చెప్పారని తెలిపారు. ఈ పదవిని చేపట్టాలని తాను చాలాసార్లు ఆయనకు విజ్ఞప్తి చేసినప్పటికీ, ఆయన తిరస్కరించారని చెప్పారు. 


అశోక్ గెహ్లాట్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ అధ్యక్ష పదవిని రాహుల్ గాంధీ చేపట్టాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని, అదే విషయాన్ని ఆయనకు చాలాసార్లు చెప్పానని తెలిపారు. తన విజ్ఞప్తిపై రాహుల్ స్పందిస్తూ, కాంగ్రెస్ తదుపరి అధ్యక్షుడు గాంధీ కుటుంబానికి చెందినవారై ఉండకూడదని స్పష్టం చేశారన్నారు. 


కాంగ్రెస్ అధ్యక్ష పదవికి జరిగే ఎన్నికల కోసం తాను త్వరలోనే తన నామినేషన్‌ పత్రాలను దాఖలు చేస్తానని గెహ్లాట్ చెప్పారు. దేశంలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రతిపక్షాలు బలంగా ఉండవలసిన అవసరం ఉందని తెలిపారు. 


ఇదిలావుండగా,  కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు అక్టోబరు 17న జరుగుతాయి. ఓట్ల లెక్కింపు అక్టోబరు 19న జరుగుతుంది. ఈ ఎన్నికల్లో ఎంపీ శశి థరూర్ కూడా పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. 


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.