యాక్ట్ ఈస్ట్ పాలసీలో ఆసియాన్‌‌కు పెద్ద పీట : మోదీ

ABN , First Publish Date - 2020-11-12T23:31:01+05:30 IST

ఆగ్నేయాసియా దేశాలతో భారత దేశ సంబంధాలకు చారిత్రక,

యాక్ట్ ఈస్ట్ పాలసీలో ఆసియాన్‌‌కు పెద్ద పీట : మోదీ

న్యూఢిల్లీ : ఆగ్నేయాసియా దేశాలతో భారత దేశ సంబంధాలకు చారిత్రక, భౌగోళిక, సాంస్కృతిక వారసత్వం ప్రాతిపదిక అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఇండో పసిఫిక్ ఓషన్ విషయంలో భారత దేశం, ఆసియాన్ విధానాల్లో సారూప్యత ఉందన్నారు. 17వ ఆసియాన్-ఇండియా వర్చువల్ సదస్సులో ఆయన గురువారం మాట్లాడారు. 


భారత దేశపు పసిఫిక్ విజన్‌కు ఆసియాన్ (ఆగ్నేయాసియా దేశాల సంఘం) ముఖ్యమైనదని చెప్పారు. భారత దేశం అమలు చేస్తున్న యాక్ట్ ఈస్ట్ పాలసీకి కేంద్రం ఆసియాన్ అని తెలిపారు. ఈ ప్రాంతంలో అన్ని దేశాల భద్రత, అభివృద్ధి కోసం సమన్వయం, స్పందించే తత్త్వంగల ఆసియాన్ అవసరమని చెప్పారు. ఆసియాన్‌తో అన్ని రకాలుగా అనుసంధానాన్ని ఏర్పరచుకోవడానికి భారత దేశం ప్రాధాన్యమిస్తుందని చెప్పారు. 


17వ ఇండియా-ఆసియాన్ సదస్సుకు ప్రధాని మోదీతోపాటు వియత్నాం ప్రధాన మంత్రి ఎన్‌గుయెన్ సహాధ్యక్షత వహించారు. ఆసియాన్-ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్యం, కనెక్టివిటీ, మారిటైమ్ కోఆపరేషన్, వాణిజ్యం, విద్య, కెపాసిటీ బిల్డింగ్ తదితర అంశాలపై ఈ సదస్సులో చర్చిస్తారు. 


ఆసియాన్ సభ్య దేశాలు : ఇండోనేషియా, మలేసియా, ఫిలిప్పైన్స్, సింగపూర్, థాయ్‌లాండ్, బ్రూనే, వియత్నాం, లావోస్, మయన్మార్, కాంబోడియా. కాగా ఆసియాన్ డయలాగ్ పార్టనర్స్‌గా భారత దేశం, చైనా, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా వ్యవహరిస్తున్నాయి. 


Updated Date - 2020-11-12T23:31:01+05:30 IST