ఇప్పట్లో లేనట్టే!

ABN , First Publish Date - 2021-08-04T05:25:27+05:30 IST

నేతల ‘పునర్విభజన’ ఆశలపై కేంద్ర ప్రభుత్వం నీళ్లు చల్లింది. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ఇప్పట్లో లేనట్టేనని స్పష్టం చేసింది. 2031 తరువాతేనని తేల్చి చెప్పింది. టీ పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌ రెడ్డి మంగళవారం లోక్‌సభలో నియోజకవర్గాల పునర్విభజన అంశాన్ని లేవనెత్తారు. దీనిపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్‌ వివరణ ఇచ్చారు.

ఇప్పట్లో లేనట్టే!

నియోజకవర్గాల పునర్విభజనపై తేల్చి చెప్పిన కేంద్రం

2031 తరువాతేనని స్పష్టం

నేతల ఆశలపై నీళ్లు

(సాలూరు రూరల్‌)

నేతల ‘పునర్విభజన’ ఆశలపై కేంద్ర ప్రభుత్వం నీళ్లు చల్లింది. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ఇప్పట్లో లేనట్టేనని స్పష్టం చేసింది. 2031 తరువాతేనని తేల్చి చెప్పింది. టీ పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌ రెడ్డి మంగళవారం లోక్‌సభలో నియోజకవర్గాల పునర్విభజన అంశాన్ని లేవనెత్తారు. దీనిపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్‌ వివరణ ఇచ్చారు. 2031 వరకూ పునర్విభజన ఉండదని తేల్చిచెప్పారు. విభజన చట్టంలో సెక్షన్‌ 26 ప్రకారం తెలంగాణ, ఏపీలో అసెంబ్లీ స్థానాలు పెంచుతామని అప్పట్లో కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఆ లెక్కన 175 అసెంబ్లీ స్థానాలున్న ఏపీలో పునర్విభజనతో 225 స్థానాలకు పెంచేందుకు సుముఖంగా ఉన్నట్టు అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం సమ్మతిని తెలిపింది. కానీ ఇంతవరకూ ఎటువంటి కదలిక లేదు. పునర్విభజన ఊహాగానాల నేపథ్యంలో సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వడంతో ఇప్పట్లో పునర్విభజన లేనట్టే. పునర్విభజనతో తమకు అవకాశాలు వస్తాయని భావిస్తున్న నేతలకు ఇది చేదు కబురే.. 2002లో 82వ రాజ్యాంగ సవరణ ప్రకారం  అసెంబ్లీ,పార్లమెంట్‌ స్థానాల పునర్విభజన ప్రక్రియను జరిపారు. అప్పుడే జిల్లాలో బొబ్బిలి, పార్వతీపురం పార్లమెంట్‌ స్థానాలు కనుమరుగయ్యాయి. విజయనగరం, అరకు పార్లమెంట్‌ స్థానాలు ఏర్పడ్డాయి. జిల్లాలో అప్పటివరకూ ఉన్న 12 అసెంబ్లీ నియోజకవర్గాలు స్థానంలో  9 అసెంబ్లీ స్థానాలు ఏర్పడ్డాయి. అప్పటివరకూ ఉన్న నాగూరు, తెర్లాం, భోగాపురం, ఉత్తరాపల్లి స్థానాలు కనుమరుగయ్యాయి. కొత్తగా కురుపాం, నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గాలు తెరపైకి వచ్చాయి. ప్రస్తుతం జిల్లాలో సాలూరు, కురుపాం, పార్వతీపురం, బొబ్బిలి, గజపతినగరం, చీపురుపల్లి, నెల్లిమర్ల, విజయనగరం, శృంగవరపుకోట అసెంబ్లీ స్థానాలున్నాయి. విభజన చట్టం ప్రకారం పునర్విభజన జరిగితే ప్రస్తుత అసెంబ్లీ నియోజకవర్గాల పరిధులు మారనున్నాయని అంతా భావించారు. ఎస్టీ రిజర్వుడ్‌ నియోజకవర్గంగా ఉన్న సాలూరు జనరల్‌ కావొచ్చుననే ప్రచారం జరిగింది. ఒకటి రెండు స్థానాలు పెరిగే అవకాశముంటుందని అంతా భావించారు. కానీ ఈ ఊహాగానాలన్నింటినీ తెర దించుతూ పునర్విభజన ఇప్పట్లో లేనట్టేనని కేంద్రం తేల్చి చెప్పింది. 


Updated Date - 2021-08-04T05:25:27+05:30 IST