కంటోన్మెంట్‌ జోన్‌గా.. గుంటూరులోని మంగళదాస్‌నగర్‌

ABN , First Publish Date - 2020-03-29T14:38:53+05:30 IST

గుంటూరు నగరంలోని మంగళదాస్‌నగర్‌..

కంటోన్మెంట్‌ జోన్‌గా.. గుంటూరులోని మంగళదాస్‌నగర్‌

గుంటూరు(ఆంధ్రజ్యోతి): గుంటూరు నగరంలోని మంగళదాస్‌నగర్‌ ప్రాంతాన్ని కంటోన్మెంట్‌ జోన్‌గా ప్రకటించినట్లు కమిషనర్‌ అనురాధ తెలిపారు. ఈ జోన్‌ మూడు కిలోమీటర్ల పరిధిలో రాజావారితోట, సాంబశివపేట, కొత్తపేట, లాలాపేట, బరయిమాంపంజా, బీఆర్‌ స్టేడియం ప్రాంతం, పాతగుంటూరు పశ్చిమ ప్రాంతం యడ్లబజారు, పాతగుంటూరు, ఆర్టీసీ కాలనీ తదితర ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేపట్టారు.


సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణం, బ్లీచింగ్‌, సున్నం చల్లిస్తూ డిస్‌ ఇన్‌ఫెక్షన్‌ చర్యలు తీసుకుంటున్నామన్నారు. కొందరు సోషల్‌ మీడియాలో మంగళదాస్‌నగర్‌ సమీపంలోని కొన్ని ప్రాంతాలను రెడ్‌ జోన్‌గా ప్రకటించినట్లు వస్తున్న వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదని, స్థానికులు భయబ్రాంతులకు గురి కావద్దని తెలిపారు. పారిశుధ్య చర్యల్లో భాగంగా నగరంలోని ప్రతి ఇంటి గేట్లకు, వీధుల్లో సోడియం హైపో క్లోరైడ్‌ పిచికారి చేయించాలని, ప్రతి వీధిలో కాల్వలు అన్ని శుభ్రం చేసి బ్లీచింగ్‌ చల్లించాలని అనురాధ ఇంజనీరింగ్‌, శానిటేషన్‌ అధికారులను ఆదేశించారు. శనివారం ఆమె ఆనందపేట, సంగడిగుంట, డీఎస్‌నగర్‌, నల్లచెరువు తదితర ప్రాంతాల్లో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను తనిఖీ చేశారు.

Updated Date - 2020-03-29T14:38:53+05:30 IST