Advertisement
Advertisement
Abn logo
Advertisement

పల్లిపాళెం బాధితులకు ‘ఆర్తీ హోమ్‌’ ఆపన్న హస్తం

విడవలూరు, డిసెంబరు 2: ఇటీవల ముంపునకు గురైన ఊటుకూరు పల్లిపాళెం కాలనీవాసులకు ఆర్తీ హోమ్‌ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు పుచ్చలపల్లి శ్రీనివాసులురెడ్డి, శ్రీమతి పీవీ సంధ్య ఆధ్వర్యంలో గురువారం వంట సరుకులను, దుప్పట్లు, చీరలు, లుంగీలను అందజేశారు. మండలంలోని పల్లిపాళేనికి చెందిన వరద బాధితులకు స్థానిక నాయకులు రామిరెడ్డి విజయభానురెడ్డి, వంశీకృష్ణారెడ్డి, ఎంపీడీవో చిరంజీవి చేతుల మీదుగా సామగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా బెజవాడ వంశీకృష్ణారెడ్డి మాట్లాడుతూ స్వగ్రామానికి చెందిన శ్రీనివాసులురెడ్డి దంపతులు ఇతర ప్రాంతాల్లో నివాసం ఉన్నా బాధితులకు సాయం చేయడానికి ముందుకు వచ్చారన్నారు. ఈ స్వచ్ఛంద సంస్థ ద్వారా కడప, చిత్తూరు, నెల్లూరులోని వరద బాధితులకు సహాయం చేయడం ఆభినందనీయమన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ చౌటూరు వెంకట శేషమ్మ, కార్యదర్శి రాధాకుమారి, కొండూరు హరిరెడ్డి పాల్గొన్నారు. 

Advertisement
Advertisement