లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్‌లో వివిధ పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. టికెట్లు దక్కని అభ్యర్థుల ఏడుపులు, పెడబొబ్బలు, డ్రామాలూ మొదలయ్యాయి. ముజఫర్ నగర్ జిల్లాలోని ఛార్థావాల్ నియోజకవర్గానికి బీఎస్పీ తన అభ్యర్థిని ప్రకటించింది. ఈ సీటును ఆ పార్టీ నేత ఆర్షద్ రాణా ఆశించారు. కానీ, తనకు సీటు దక్కకపోవడంతో శుక్రవారం ఆయన వెక్కి వెక్కి ఏడ్చారు. తనకు న్యాయం చేయకపోతే ఆత్మాహుతి చేసుకుంటానని అన్నారు. టికెట్ కావాలంటే రూ.67 లక్షలు ఇవ్వాలని రెండేళ్ల కిందట పార్టీ సీనియర్ నేత ఒకరు డిమాండ్ చేశారని ఆరోపించారు.