నకిలీ సర్టిఫికెట్ల తయారీదారుడి అరెస్టు

ABN , First Publish Date - 2020-02-20T09:30:28+05:30 IST

నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసి విక్రయిస్తున్న ఓ వ్యక్తిని పామిడి సీఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.

నకిలీ సర్టిఫికెట్ల తయారీదారుడి అరెస్టు

7 మార్కుల జాబితాలు, సెల్‌ఫోన్‌ స్వాధీనం


పామిడి, ఫిబ్రవరి19: నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసి విక్రయిస్తున్న ఓ వ్యక్తిని పామిడి సీఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. స్థాని క పోలీసుస్టేషన్‌లో బుధవారం తాడిపత్రి డీఎస్పీ శ్రీనివాసులు విలేకరులకు వివరాలు వెల్లడించారు. విడపనకల్లు మండలం జనార్దనపల్లికి చెందిన నెట్టెం ధనుంజయనాయుడు అలియాస్‌ బాబు అనంతపురంలోని జీసస్‌ నగర్‌లో ఎస్‌వీ డిగ్రీ కళాశాల దగ్గర ఓ ఇంటిలో బాడుగకు ఉన్నాడు. అనంతపురంలోని రామ్‌నగర్‌కు వెళ్తున్నప్పుడు స్నేహితుడి(పేరుగోప్యంగా ఉంచారు) ద్వారా గుంతకల్లు పట్టణానికి చెందిన గ్లెన్‌బ్రిగ్స్‌తో పరిచయం ఏర్పడిందన్నారు.


నకిలీ మార్కులిస్టులు తయారు చేసి విక్రయించి వచ్చినసొమ్మును పంచుకోవాలని వారు పథకం పన్నా రు. హైదరాబాద్‌కు చెందిన గౌతమ్‌ కోరిక మేరకు బీటెక్‌లో ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌ కోర్సు చేసినట్లు నకిలీ సర్టిఫికెట్‌ తయారు చేయడానికి రూ.లక్షకు ఒప్పందం చేసుకున్నారు. ఆమేరకు సర్టిఫికెట్‌ తయా రు చేసి అందజేసేందుకు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద ఎదురుచూస్తుండగా సీఐ శ్రీనివాసులు, ఏఎ్‌సఐ శివశంకర్‌, కానిస్టేబుళ్లు చాకచక్యంగా ధనుంజయనాయుడుతో పాటు 7 సర్టిఫికెట్లు, సెల్‌ఫోన్‌ స్వాఽధీనం చేసుకున్నామన్నారు. ఇప్పటికీ చాలామందిని వీరు ఉద్యోగాలు పేరుతో, నకిలీ సర్టిఫికెట్లు పేరుతో చాలా మోసాలకు పాల్పడ్డారని, బాధితులు సమాచారమందిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Updated Date - 2020-02-20T09:30:28+05:30 IST