బీజేపీ నాయకుల అరెస్టు

ABN , First Publish Date - 2022-08-19T04:13:00+05:30 IST

దహెగాం మండ లం లగ్గాం పెద్దవాగు వంతెన అప్రోచ్‌రోడ్డును గురువారం శ్రమదానం చేసి నిర్మించేం దుకు బీజేపీ నాయకులు నిర్ణ యించారు. అయితే శ్రమదానం చేపట్టరాదని పట్టణ సీఐ రవీందర్‌ ఆధ్వర్యంలో పోలీసులు బీజేపీ నాయకుడు డా హరీష్‌బాబును అరెస్టు చేశారు.

బీజేపీ నాయకుల అరెస్టు
డాక్టర్‌ హరీష్‌ బాబును అరెస్టు చేస్తున్న సీఐ రవీందర్‌

కాగజ్‌నగర్‌/దహెగాం, ఆగస్టు 18: దహెగాం మండ లం లగ్గాం పెద్దవాగు వంతెన అప్రోచ్‌రోడ్డును గురువారం శ్రమదానం చేసి నిర్మించేం దుకు బీజేపీ నాయకులు నిర్ణ యించారు. అయితే శ్రమదానం చేపట్టరాదని పట్టణ సీఐ రవీందర్‌ ఆధ్వర్యంలో పోలీసులు బీజేపీ నాయకుడు డా హరీష్‌బాబును అరెస్టు చేశారు. ఈ సందర్భంగా హరీష్‌బాబు మాట్లాడుతూ తాము శాంతియుతంగా శ్రమదానం చేస్తామంటే కూడా పోలీసులు అరెస్టు చేయడం దారుణమన్నారు. సిర్పూరు ఎమ్మెల్యే కోనప్ప అసమర్థత వల్లే దహెగాం మండలానికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయినట్టు పేర్కొన్నారు. అనంతరం పోలీ సులు బీజేపీ నాయకులందరినీ అదుపులోకి తీసుకున్నారు. దహెగాంలో అరెస్టయిన వారిలో తిరుపతిగౌడ్‌, ధనుంజయ్‌, దామోదర్‌, సత్యనారాయణ, నారాయణ, సురేష్‌ ఉన్నారు. 

Updated Date - 2022-08-19T04:13:00+05:30 IST